బదిలీపై వెళ్లిన పోలీసులకు సన్మానం


Wed,September 12, 2018 03:07 AM

నయీంనగర్, సెప్టెంబర్11: కమిషనరేట్ నుంచి బదిలీ పై ఇతర ప్రాంతాలకు వెళ్లిన పోలీస్ అధికారులను మంగళ వారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సన్మానిం చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలీస్ కమిషన ర్ రవీందర్ హాజరై మాట్లాడుతూ బదిలీ అయిన అధికా రులంతా విధి నిర్వహణలో చక్కగా రాణించారని అన్నారు. ఇదే స్ఫూర్తితో బదిలీ అయిన ప్రదేశంలో రాణించాలని సూ చించారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుల పట్ల అధికారిగా వ్యహ రించకుండా సాటి మనిషిగా మానవతా దృక్పథంతో ఉండా లన్నారు. అనంతరం జ్ఞాపికలతో సన్మానించారు. ఈ సంద ర్భంగా బదిలీ అయిన డీసీపీ వెంకటేశ్వర్లు(ప్రస్తుత సూర్యా పేట ఎస్పీ), అదనపు డీసీపీ మురళీధర్, ఏసీపీ రాజేంద్ర ప్రసాద్, ప్రభాకర్‌రావు, మదన్‌లాల్, వెంకటరమణారెడ్డి, విద్యాసాగర్, ఇన్‌స్పెక్టర్లు రవికుమార్, శ్రీనివాస్, నరేందర్, వేణుచందర్, శ్రీనివాస్‌రాజ్, రవికుమార్‌తో ఉద్యోగ విర మణ పొందిన రవీందర్ తమ అనుభవాలను తెలియజేశా రు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్, వెస్ట్‌జోన్ డీసీపీలు వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, క్రైం అదనపు డీసీపీ అశోక్‌కుమా ర్, ఏసీపీలు చంద్రయ్య, మధుసూదన్, వెంకటేశ్వర్‌బాబు, సునీతామెహన్, సుధీంద్ర, శ్రీనివాస్, సదానందం, తది తరులు పాల్గొన్నారు.

186
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...