24వ తేదీ వరకు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం


Wed,September 12, 2018 03:07 AM

-గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కమిషనర్ వీపీ గౌతమ్
పోచమ్మమైదాన్, సెప్టెంబర్ 11 : కొత్త ఓటర్లుగా నమోదు చేసుకునే వారికి ఈ నెల 24 వరకు అవకాశం ఉందని కమిషనర్, వరంగల్ తూర్పు నియోజక వర్గ రిటర్నింగ్ ఆఫీసర్ వీపీ గౌతమ్ అన్నారు. వరంగల్ ఐఎంఏ హాల్లో వరంగల్, ఖిలా వరంగల్ మండలాలకు చెందిన బూత్ లెవల్ ఆఫీసర్లు ( బీఎల్‌వోలు), అంగన్‌వాడీ టీచర్లతో మంగళవారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల సందర్భంగా అర్హులైనవారు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని తెలిపారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 15, 16 తేదీల్లో ఆయా పోలింగ్ కేంద్రాల్లో బీఎల్‌వోలు అందుబాటులో ఉంటారని, కొత్త ఓట రుగా నమోదుకు ఫారం-6 పూర్తి చేసి ఇవ్వాలని పేర్కొన్నారు. మీ సేవ కేం ద్రాల్లో కూడా ఓటరు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అలాగే ఓటర్ల జాబితాలో తప్పులు సరిచేయడం, తొలగించాల్సిన పేర్లు, చనిపోయినవారి పేర్లు, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి పేర్లను తొలగించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా కొత్త ఓటర్ల నమోదు కోసం ప్రజల్లో చైత న్యం కోసం పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. సమావేశంలో వరంగల్ తహసీల్దార్ బీ రాజేశ్, ఖిలా వరంగల్ తహసీల్దార్ కిరణ్‌కుమార్, నయాబ్ తహసీల్దార్ ఎండీ రియాజుద్దీన్, నయాబ్ తహసీల్దార్ శ్రీపాల్‌రెడ్డి, గిర్ధావరీ చింతం స్వాతి, సీనియర్ అసిస్టెంట్ కాల్వల శ్రీనివాస్, వీఆర్‌వోలు చిరంజీవి, శ్రీనివాస్, సురేశ్, శ్రీదేవి కుమారస్వామి పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రాల పరిశీలన...
వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాలను తహసీల్దార్ రాజేశ్ మంగళవారం పరిశీలించారు. ఆయా పోలింగ్ కేంద్రాల భవనాల పరిస్థితి, ఇతర వసతులను తనిఖీ చేశారు. వరంగల్ తూర్పులో 213 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.

181
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...