18 ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలి


Wed,September 12, 2018 03:05 AM

-కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
అర్బన్ కలెక్టరేట్, సెప్టెంబర్ 11: ఎన్నికల జాబితా స్పెషల్ సమ్మరీ రివిజన్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు తమ పేర్లు ఓటరు జాబితాలో నమోదు చేయించుకోవాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ నెల 25వ తేదీ వరకు ఓటరు నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందన్నారు. 2018 జనవరి ఒకటవ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు (2000 జనవరి ఒకటవ తేదీకి ముందు జన్మించినవారు) దరఖాస్తు చేసుకోవాలన్నారు. మొదటి సారి ఓటరుగా నమోదు చేసుకునే వారు, ఒక అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలో నుంచి మరొక అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలోని పోలింగ్ కేంద్రంలోకి మార్చేందుకు ఫారం -6ను ఉపయోగించాలన్నారు. అలాగే విదేశాల్లో ఉంటున్న భారత పౌరులు ఓటరుగా నమోదుకు ఫారం-6ఎ, జాబితా నుంచి పేరు తొలగించేందుకు ఫారం-7ను, పేర్లు, వయస్సు, ఫొటోల మార్పు, సెక్స్, టైపింగ్‌లో అక్షర తప్పులను సవరించేందుకు ఫారం-8ని, అదే నియోజకవర్గం పరిధిలో అడ్రసు మార్చేందుకు ఫారం-8ఎను వినియోగించాలన్నారు. ఇందుకు సంబంధించిన ఫారాలు http://ceotelangana. nic.in &http://www.nvs.in వెబ్‌సైట్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఎన్నికల వెబ్‌సైట్లను సందర్శించి ఫారం-6, ఫారం-6ఎ, ఫారం-7, ఫారం-8, ఫారం-8ఎలో ఆన్‌లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఓటర్ల జాబితాలో తమ పేర్లను పరిశీలించుకునేందుకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వెబ్‌సైట్ http://ceotelangana.nic.inలో చూడాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

184
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...