గుడిలో సర్కారు దీపం


Tue,September 11, 2018 02:30 AM

రెడ్డికాలనీ, సెప్టెంబర్ 10: గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి నోచుకోని ఆలయాలకు స్వరాష్ట్రంలో మహర్దశ పట్టనుంది. శిథిలావస్థకు చేరుకున్న దేవాలయాలకు సీఎం కేసీఆర్ కొత్త శోభ తేచ్చేందుకు కసరత్తు చేశారు. ఈమేరకు గుడిలో సర్కారు దీపం వెలిగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఆలయాల అభివృద్ధికి నిధులను కేటాయిస్తూ ప్రణాళిక సిద్ధం చేశారు. అనుకున్నదే తడవుగా ఆలయాల అభివృద్ధికి దశలవారీగా నిధులు కేటాయిస్తూ దేవాలయాల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 1860 దేవాలయాలను ప్రభుత్వం ఎంపిక చేసి దూప, దీప నైవేద్యం కింద ఆలయ నిర్వహణకు ప్రభుత్వం ఖర్చు చేసేందుకు నిర్ణయించింది. ఇందుకుగాను ప్రభుత్వం రూ.27 కోట్ల నిధులను కేటాయించింది. ఈమేరకు ఆలయ అర్చకులకు అక్టోబర్ నుంచి రూ.6 వేల చొప్పున వేతనాలు అందించడానికి మార్గదర్శకాలు రూపొందించింది. ఆదాయం లేని దేవాలయాల నిర్వహణ బాధ్యతలను చేపట్టాలనే సంకల్పంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ధూప, దీప నైవేద్యం పథకాల్లో వరంగల్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలు దేవాలయాలను చేర్చింది. ఉమ్మడి జిల్లాల్లోని 151 దేవాలయాలను ఈ పథకంలో ఎంపిక చేసింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో నెం.193 ప్రకారం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ అర్బన్ జిల్లాలో-17, వరంగల్ రూరల్ జిల్లాలోని 34, జనగామ జిల్లా-38, మహబూబాబాద్ జిల్లాలో- 34, జ యశంకర్ భూపాపల్లి జిల్లాలోని-34 దేవాలయాలను ధూప, దీప నైవేద్యం పథకంలో చేర్చింది.

మాట నిలబెట్టుకున్న సీఎం
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాలకు పూర్వవైభవం తీసుకువస్తానని ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారు. తెలంగాణ అర్చక సమా ఖ్య ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ను కలిసి అర్చ కులు తమ దుర్భరస్థితిని వివరించిన విషయం తెలిసిందే. తెలంగాణ ఏర్పాటు తర్వాత అందరి బతుకులు బాగుండాలని తలిచిన సీఎం కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1860 దేవాలయాలకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ధూప, దీప నైవేద్యం నిధులు మంజూ రు చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న అధినేత కేసీఆర్ నిర్ణయానికి అర్చక సమాఖ్య జేజేలు పలికింది. కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.

184
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...