సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ


Mon,September 10, 2018 03:27 AM

సుబేదారి: నిస్వార్థ సేవ కార్యక్రమాలతోనే దేశం వేగవంతగా అభివృద్ధి చెందుతుందని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. వరంగల్ సేవాభారతి, రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం హన్మకొండ సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో జాతి నిర్మాణంలో సేవ-మన పాత్ర అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్యవక్తగా లక్ష్మీనారాయణ హాజరై, మాట్లాడుతూ దేశ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని అన్నారు. వ్యక్తిగత స్వార్థాన్ని వదిలి సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నపుడే భవ్యమైన, దేశ నిర్మాణం జరుగుతుందని వివరించారు. కేరళ వరద బాధితులకు ఆర్థికసాయం చేసుకుందుకు యావత్ భారత్ స్పందించడం దేశ సేవ దృక్పదానికి నిదర్శమని కొనియాడారు.

అనాథ బాలబాలికలకు ఆకాంక్ష సంస్థ ద్వారా విద్య బుద్దులు నేర్పుతున్న ముంబాయి మహిళ షహీన్ మిస్త్రీ, సులభ్ కాంప్లెక్స్ నిర్మాణం ద్వారా లక్షాదిమంది సఫాయి కార్మికుల్లో ఆత్మాభిమానాన్ని ప్రసాదించిన బిందేశ్వర్ పాఠక్, ఇలా ఎంతో మంది దేశ సేవకు అంకితమయ్యారని గుర్తుచేశారు. సదస్సులో భాగంగాసాయంత్రం రెండో విడతలో విద్య, తల్లీదండ్రులు, విద్యార్థుల పాత్ర అనే అంశంపై ఆయన మాట్లాడుతూ పిల్లలకు ఒక్క చదువే కాకుండా ఆటలు, నైతిక విలువలు నేర్పించాలని అన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ దక్షిణ మాధ్య క్షేత్ర సేవా ప్రముఖ్ ఎక్కా చంద్రశేఖర్, సేవాభారతి వరంగల్ అధ్యక్షుడు రాంకుమార్‌రెడ్డి, విద్యావేత్తలు, వైద్యులు, న్యాయవాదులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.

231
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...