చింతగట్టులో టాస్క్‌ఫోర్స్ దాడులు


Mon,September 10, 2018 03:26 AM

నయీంనగర్, సెప్టెంబర్ 09 : కేయూసీ పోలీస్ స్టేషన్‌లో పరిధిలోని చింతగట్టు గ్రామంలో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం రాత్రి దాడులు జరిపారు. టాస్క్‌ఫోర్స్ సీఐ రమేష్ కుమార్ కథనం ప్రకారం.. చింతగట్టు గ్రామానికి చెందిన బిల్లా లక్ష్మీకాంతరెడ్డి పేకాట రాయుళ్లకు తన ఇంట్లో ఆశ్రయం కల్పిస్తూ ఒక్కో గేమ్‌కు డబ్బులు తీసుకుంటూ పేకాట శిబిరాన్ని నిర్వహిస్తున్నాడనే సమాచారం మేరకు దాడులు చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కమిషనరేట్‌లో ఏఆర్ ఎస్సైగా పనిచేస్తున్న ధరావత్ పున్నంనాయక్‌తో పాటు మరో రిటైర్డ్ ఆర్‌ఎస్సై ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. పట్టుబడిన వ్యక్తుల నుంచి రూ.54,820 స్వాధీనం చేసుకుని 11 సెల్‌ఫోన్లు, 3 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి పేకాట రాయుళ్లను కేయూసీ పోలీసులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.

182
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...