ఆకట్టుకున్న భవన నిర్మాణరంగ ఉత్పత్తుల ప్రదర్శన


Mon,September 10, 2018 03:26 AM

మట్టెవాడ, సెప్టెంబర్ 09: భవన నిర్మాణదారులకు ఆధునిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన భవన నిర్మాణరంగ ఉత్పత్తుల ప్రదర్శన(బిల్డ్ ఎక్స్ పో) -2018 ఆదివారం ముగిసింది. అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజినీర్స్(ఇండియా)కరీంనగర్ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఎక్స్‌పో 2018 వరంగల్ లోని వేంకటేశ్వర గార్డెన్‌లో రెండు రోజుల పాటు కొనసాగింది. భవన నిర్మాణదారులు, బిల్డర్స్, సివిల్ ఇంజినీర్స్, ఇంజినీరింగ్ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ఆసక్తిగా తిలకించారు.

హైదరాబాద్ తర్వాత వరంగల్‌లో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో 85ప్రముఖ కంపెనీలకు చెందిన స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇందులో భవన నిర్మాణాలకు సంబంధించిన స్టీల్, సిమెంట్, టైల్స్, విద్యుత్ కేబుల్స్, పైపులు, పెయింట్స్, సానిటరీ ఐటమ్స్ లాంటి ఉత్పత్తులను ఈ ప్రదర్శనలో ఉంచారు. నూతన టెక్నాలజీతో ప్రస్తుత పరిస్థితులు, వాతావరణానికి అనుగుణంగా తయారు చేసిన వస్తువులను ప్రజలకు వివరించడం జరిగింది. ముగింపు కార్యక్రమంలో వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులతో పాటు జిందాల్ ఫైంథర్ 550డీ సౌత్ ఇండియా రిటైల్ హెడ్ అజిత్‌కుమార్, అమ్మోర్ మనియార్, సునీల్‌కమార్, వరంగల్‌కు చెందిన కొడెం రాజేందర్, సునీల్‌కుమార్‌లతో పాటు పలు కంపెనీలకు చెందిన ప్రముఖుల పాల్గొన్నారు.

167
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...