వ్యాధుల నివారణకు పాథాలజిస్టులు కృషి చేయాలి


Mon,September 10, 2018 03:24 AM

పోచమ్మమైదాన్, సెప్టెంబర్ 09: వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో రెండు రోజుల నుంచి నిర్వహిస్తున్న మూడవ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పాథాలజిస్ట్స్ అండ్ మైక్రోబయోలజిస్ట్స్ తెలంగాణ స్టేట్ ఛాప్టర్ కాన్ఫరెన్స్ ఆదివారం ముగిసింది. తెలంగాణలోని పలు జిల్లాల నుంచి వందలాది మంది పాథాలజిస్టులు, మెడికల్ విద్యార్థులు పాల్గొని వైద్యరంగంలో వస్తున్న మార్పులపై చర్చించారు. ముఖ్యంగా వైద్య సేవల్లో భాగమైన పాథాలజిస్టులకు వ్యాధుల నిర్ధారణలో ఆధునాతన పద్ధతులపై అవగాహన కల్పించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యాప్తిస్తున్న కొత్త వ్యాధులపై నిరంతర పరిశోధనలు జరుపాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ సహకారంతో ఆయా మెడికల్ కాలేజీల్లో తరచూ సీఎంఈ ప్రోగ్రాంలు నిర్వహించి, ఆధునిక పరిజ్ఞానంతో వ్యాధుల నివారణకు కృషి చేయాలని తీర్మానించారు. తెలంగాణ ఏర్పడిన అనంతరం స్టేట్ కాన్ఫరెన్స్‌ను వరంగల్‌లోని కేఎంసీలో ఏర్పాటు చేయడం పట్ల స్థానిక వైద్యులు హర్షం వ్యక్తం చేశారు.

అనంతరం ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పాథాలజిస్ట్స్ అండ్ మైక్రోబయోలజిస్ట్ తెలంగాణ స్టేట్ నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. ప్రెసిడెంట్‌గా కేఎంసీ విశ్రాంతప్రిన్సిపాల్ డాక్టర్ హెచ్ సంధ్యారాణి ( కేఎంసీ వరంగల్ ), సెక్రటరీగా డాక్టర్ చంద్రశేఖర్ ( రిమ్స్ ఆదిలాబాద్ ), ట్రెజరర్‌గా డాక్టర్ నావెల్ కిషోర్ ( మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీ ), వైఎస్ ప్రెసిడెంట్‌గా డాక్టర్ సంధ్య అనిల్ ( కేఎంసీ వరంగల్ ), జాయింట్ సెక్రటరీగా డాక్టర్ ఎండీ అన్వర్ మియా ( కేఎంసీ వరంగల్ ), ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా డాక్టర్ శ్రీధర్ ( భాస్కర్ మెడికల్ కాలేజీ, హైదరాబాద్), డాక్టర్ రాంబాబు ( ఈఎస్‌ఐ, మెడికల్ కాలేజీ హైదరాబాద్ ), డాక్టర్ రాజా ఉజ్వల ( షాధన్ మెడికల్ కాలేజీ, హైదరాబాద్), డాక్టర్ శ్రీవాణి ( గాంధీ మెడికల్ కాలేజీ, హైదరాబాద్ ), డాక్టర్ నంద కిషోర్ (నిజామాబాద్ మెడికల్ కాలేజీ)ఎంపికైన వారిలో ఉన్నారు. ఈ నూతన కార్యవర్గ సభ్యులు రెండేళ్ల పాటు కొనసాగుతారు.

240
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...