తెలంగాణ ద్రోహులు కొండా దంపతులు


Sun,September 9, 2018 03:26 AM

-ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్
-రౌడీలకు, గూండాలకు టీఆర్‌ఎస్‌లో తావులేదు
-ఎంపీ పసునూరి దయాకర్
-నన్ను కూడా కొండా మురళి బెదిరించారు.
-కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి
-దాస్యంకు టికెట్ ప్రకటనతో పశ్చిమలో సంబురాలు
సిద్ధార్థనగర్, సెప్టెంబర్ 08 : టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కొండా దంపతలకు రాజకీయ భవిష్యత్‌ను ప్రసాదించారని, వీరు పార్టీలో చేరకముందు ఒక మాదిరి, పార్టీలో చేరాక తెలంగాణ ద్రోహులుగా కొండా దంపతులు మారారని అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం వడ్డేపల్లిలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలోఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డిలతో కలిసి మాట్లాడారు. కొండా దంపతుల రాజకీయ జీవితం అంతమవుతున్న సందర్భంలో తన దగ్గరకు వచ్చి టీఆర్‌ఎస్‌లో రాజకీయ భిక్ష పెట్టాలని కొండా దంపతులు అడిగినప్పుడు ప్రజలను భయబ్రాంతులకు గురి చేయకుండా ప్రజలకు సేవ చేస్తారనే నమ్మకంతో కేటీఆర్‌కు చెప్పానని, వెంటనే ఆయన స్పందించి కొండా దంపతులను టీఆర్‌ఎస్‌లో ఆహ్వానించి వారిని దగ్గరుండి గెలిపించారని అన్నారు.

అంతమవుతున్న కొండా దంపతులకు రాజకీయ జీవితం ప్రసాదించింది టీఆర్‌ఎస్ పార్టీయేనని ఆయన అన్నారు. ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ సాధించింది టీఆర్‌ఎస్ అని, క్రమ శిక్షణకు మారుపేరు టీఆర్‌ఎస్ అని అన్నారు. త్యాగాల పునాదిపై స్థాపించింది టీఆర్‌ఎస్ అని ఆయన పేర్కొన్నారు. కేటీఆర్ లక్షల జీతాన్ని విడిచిపెట్టి ఒక క్రమశిక్షణ కార్యకర్తగా తెలంగాణ కోసం పోరాడి, గాయలపాలైన సందర్భాలు చాలా ఉన్నాయని అన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించడం కొండా దంపతులకు సరైంది కాదని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో టీఆర్‌ఎస్ కార్యకర్తలపై రాళ్లు విసిరిన సంగతి మరిచిపోయారా.. అని అన్నారు. కాంగ్రెస్ నాయకులతో కుమ్మక్కై పార్టీని వీడితే ప్రజలు తగిన బుద్ధి చెబుతాని అన్నారు. కొండా దంపతులకు టీఆర్‌ఎస్‌పై నమ్మకం లేకపోతే తమ పదవులకు వెంటనే రాజీనామా చేయాలని అన్నారు. నమ్మితే గొంతు కోసే కొండా దంపతులకు పార్టీలో అవకాశం ఉండదని అన్నారు.

పార్టీలో గూండాలకు, రౌడీలకు
తావులేదు.. : ఎంపీ పసునూరి
టీఆర్‌ఎస్ క్రమశిక్షణ గల పార్టీ అని గుండాలకు, రౌడీలకు ఇక్కడ తావులేదని, ఉద్యమ సమయంలో పార్టీ కార్యలను ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా పార్టీ కార్యాలయంపై దాడి చేయించిన ఘనత కొండాది అని ఎంపీ పసునూరి దయాకర్ అన్నారు. ప్రజలను బెదిరించి ఇబ్బందులకు గురిచేసే తత్వం కొండా సురేఖది అని అన్నారు. వారి నుంచి ప్రజలను కాపాడుకునే బాధ్యత టీఆర్‌ఎస్‌పై నే ఉందని పేర్కొనారు. వరంగల్ తూర్పు వాసులకు కొండా దంపతుల పీడ విరగడైందని సంబురాలు చేసుకుంటున్నారన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం పోరాడిన వారిని తిట్టడం సరికాదని అన్నారు. కార్యకర్తలను, కార్పొరేటర్లను బెదిరించి పనులు చేయించుకోవడం కొండా దంపతులకు సరికాదన్నారు. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని ఎంతో అభివృద్ధి చేశారని ఆయన అన్నారు. రాష్ర్టాన్ని మరింత అభివృద్ధి చెందాలంటే టీఆర్‌ఎస్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకురావాలన్నారు.

నన్ను కూడా బెదిరించారు : కుడా చైర్మన్
స్థానిక ప్రజాప్రతినిధులు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్సీ కొండా మురళి ప్రజలను బెదిరించి పనులు చేస్తున్నారని, తనను కూడా వారు బెదిరించారని కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి అన్నారు. కొండా దంపతులను పార్టీలో చేర్చుకున్నందుకకు తూర్పు నాయకులు ఎంతో బాధపడ్డారు. కానీ అధిష్ఠానం ఆలోచన మేరకు నోరు మేదపకుండా ఉన్నాం. వరంగల్ ఓ-సీటీ కుడా ప్లాట్లను వేలంపాట నిర్వహించినప్పుడు కొండా మురళి తనకు ఫోన్ చేసి వేలంపాట నువ్వేలా పెడ్తావ్.. ఖబడ్దార్ నీసంగతి చూస్తా.. అని బెదిరించాడని ఆవేదన వ్యక్తం చేశారు.

పార్టీ క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా తాను ఏనాడు ఎవ్వరికీ ఈ విషయం చెప్పుకోలేదని అన్నారు. కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ భుములన్నీ కుడా వేలం వేసి నియోజకవర్గాల అభివృద్ధికి వాడాలని సంబంధిత శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారన్నారు. తెలంగాణ ఉద్యమానికి అంకితమైన తనను బెదిరింపులకు గురి చేయడం సరికాదన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి జరగక ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురి కావడం కేసీఆర్ దృష్టికిపోవడంతోనే వారికి టికెట్‌ను ఖరారు చేయలేదని పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో కొండా మాట్లాడిన మాటలు ఇప్పటికీ ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నాయని అన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ను అభ్యర్థిగా సీం కేసీఆర్ ప్రకటించ డం చాలా సంతోషంగా ఉందన్నారు. పశ్చిమలో టీఆర్‌ఎస్ తరుపున ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ను గెలిపించి కేసీఆర్‌కు బహుమతిగా ఇవ్వాలన్నారు. పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్ పనిచేస్తోందన్నారు.

పశ్చిమలో సంబురాలు..
వరంగల్ పశ్చిమ నియోజకవరాన్గికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ పేరు ప్రకటించడంతో పశ్చిమ నాయకులు పెద్దఎత్తున సంబురాలను నిర్వహించారు. పురవీధుల్లో తిరిగి టీఆర్‌ఎస్ జెండాలను పట్టుకుని నృత్యాలు చేస్తు దాస్యం జయహో అంటూ స్వీట్లు తినిపించుకున్నారు. ఈసందర్భంగా టీఆర్‌ఎస్ శ్రేణులు ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌కు బొట్టుపెట్టి ఘనంగా స్వాగతం పలికారు. వడ్డేపల్లిలో పోచమ్మ తల్లి బోనాలను శ్రావణ మాసం చివరి ఆదివారం సందర్భంగా ప్రతీ ఒక్కరు హాజరై తల్లి దీవెనలు పొందాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్, మైనార్జీ జిల్లా నాయకులు నయీమ్, కార్పొరేటర్లు అరుణశ్రావణ్, స్వప్న, రంజిత్, మాజీ కార్పొరేటర్ సదానందం టీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

345
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...