శ్వేతార్కలో కల్యాణోత్సవాలు ప్రారంభం


Sun,September 9, 2018 03:22 AM

-భక్తులతో కిక్కిరిసి ఆలయం
కాజీపేట, సెప్టెంబర్ 08 : కాజీపేట పట్టణంలోని శ్వేతా ర్క మూలగణపతి దేవాయలంలో 16 రోజుల గణపతి నవరాత్రోవ కల్యాణోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమైనట్లు దేవాలయ వ్యవస్థాపకులు అయినవోలు అనంత మల్లయ్య శర్మ సిద్దాంతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేద పండితులు అయినవోలు రాధాకృష్ణ శర్మ, జ్యోషి మల్లికార్జున శర్మ, జ్యోషి అక్షయ్‌శర్మ దేవాలయ అర్చకులు హరిస్వామి, నారాయణ శర్మ, వేద మం త్రాలు పఠించగా గణపతి పూజ, నవ రసాలతో స్వామికి అభిషేక క్రతువును సాయికృష్ణ శర్మ ఘనంగా నిర్వహించారని తెలిపారు. అనంతరం సాయికృష్ణ శర్మ పుణ్యహవాచ నం, అంకరారోపణ, ఋత్విగ్వరణం, మంటపస్థితి అవాహన పూజలు, కలిశస్థాపన జరిపించారని తెలిపారు. దేవాలయంలో అగ్ని ప్రతిష్టాపన, సహస్రమోదకహోమం, గణేశ్ ఉపనిధ్ స్వాహాకార హోమాన్ని నిర్వహించారని తెలిపారు. భక్తులు సామూహిక సహస్ర భక్ష్యముల పూజను అంగరంగ వైభవంగా చేశారన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ జక్కుల రమా రవీందర్ యాదవ్, పలువురు ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...