మణికొండ: స్థల వివాదంలో పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన వ్యక్తి .. స్టేషన్లోనే గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుం ది. పోలీసుల కథనం ప్రకారం.. నార్సింగి ప్రాంతానికి చెందిన షేక్ నయీమొద్దీన్ కుటుంబ సభ్యులకు .. మొయినొద్దీన్‌కు మధ్య కొంతకాలంగా ఇంటి వెనక స్థలం విషయంలో వివాదం ఉంది. ఈ విషయమై అవతలి వారు ఆ స్థలంలోకి రాకుండా చూడాలని పోలీసులకు విజ్ఞప్తి చేయడంతో.. పోలీసులు షేక్ నయీముద్దీన్‌ను పిలిపించారు. బుధవారం రాత్రి స్టేషన్‌కు వచ్చిన నయీమొద్దీన్ కుర్చీలోనే కుప్పకూలిపోయాడు. వెంట నే అతన్ని కుంటుంబ సభ్యుల సహకారంతో స్థానిక దవాఖానకు తరలించారు. అప్పటికే నయీమొద్దీన్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా.. గతం లో కూడా పోలీసులు తమను ఇబ్బందులకు గురి చేశారని షేక్ నయీమ్ కుటుంబ సభ్యులు వాపోయారు. ఎస్సై కొట్టడం వల్లే ఆయన మృతి చెందినట్లు వారు పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించారు. అనంతరం ఏసీపీ ప్రసాద్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని..విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.