అయోధ్య తీర్పుపై..మోడీ, సుప్రీంకోర్టు చేసిందేమీ లేదు


Tue,November 19, 2019 03:01 AM

మణికొండ, నవంబర్‌ 18 (నమస్తే తెలంగాణ) : అయోధ్య తీర్పులో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, సుప్రీంకోర్టు చేసిందేమీ లేదని పూరి గోవర్ధన పీఠం పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య శ్రీ నిశ్చలానందన సరస్వతీ మహారాజ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. నగర శివారు మణికొండ మున్సిపాలిటీ పుప్పాలగూడలోని శ్రీ శారదామండపంలో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఈ సందర్భంగా చారిత్రాత్మక అయోధ్య మందిర నిర్మాణ అంశం అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు హయాంలోనే హైందవ జాతికి చెందినదని తేలిందన్నారు. వివాదాస్పదమైన కేసులు వేసిన వారికి సైతం అయోధ్య రాముడిదేనన్న విషయం ముందే తెలుసన్నారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉండి కూడా రామమందిరం గురించి ఏనాడు మాట్లాడలేదన్నారు. దేశంలో ఆదిశంకరులు స్థాపించిన నాలుగు జగద్గురు పీఠాలు మాత్రమే ధర్మనిష్టతో అనాధిగా అవిచ్ఛిన్న పరంపరతో ధార్మిక దిశానిర్ధేశం చేస్తున్నాయన్నారు. కొన్ని సంప్రదాయ విరుద్ధంగా స్వయంప్రకటిత పీఠాలు వేస్తున్నాయని, వాటి వల్ల కొంత నష్టం జరుగుతుందని చెప్పారు.

ప్రభుత్వాలు ధార్మిక విషయాల్లో జగద్గురు పీఠాలను అనుసరించాలని సూచించారు. అయోధ్య తీర్పు విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, సుప్రీంకోర్టు చేసిందేమీలేదని, సర్దార్‌ పటేల్‌ బతికి ఉంటే అయోధ్యలో రామమందిరం ఎప్పుడో నిర్మితమయ్యేదని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ దేవాలయాల ప్రధాన అర్చకులు, నిర్వాహకులు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...