కాప్రా: పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో జరిగిన నాలుగో ఇంటర్నేషనల్ షోటోకప్ కరాటే డు చాంపియన్‌షిప్ పోటీల్లో తెలంగాణ జట్టు సత్తా చాటింది.రాష్ట్రం నుంచి తొమ్మిదిమంది క్రీడాకారులు పాల్గొనగా ఓవరాల్‌గా 14పతకాలు (5స్వర్ణం, 5 రజతం,4 కాంస్యం)సాధించి తెలంగాణ జట్టు రన్నర్అప్ ట్రోఫీ గెల్చుకోగా, పంజాబ్ జట్ట్టు 45 మెడల్స్‌తో ఓవరాల్ ట్రోఫీ విన్నర్‌గా నిలిచింది. బాలికల 14,15 ఏళ్ల కేడెట్ కేటగరీలో వసి తన్విక కటావిభాగంలో విన్నర్‌గా నిలిచి స్వర్ణ పతకాన్ని, కుమిటిలో రజత పతకాన్ని గెలుచుకుంది. బాలుర సబ్‌జూనియర్ (అండర్ 13) విభాగంలో ఎనిమిదేళ్ల కే.సాత్విక్‌రెడ్డి కటాలో స్వర్ణపతకాన్ని,కుమిటీలో రజతం గెలుచుకున్నాడు.బాలుర సబ్‌జూనియర్ కటా విభాగంలో జి.కౌశిక్ కుమార్ స్వర్ణం, బాలికల సబ్‌జూనియర్ కుమిటీ విభాగంలో టి.రక్షిత స్వర్ణం,కటాలో కాంస్యం సాధించింది.సబ్‌జూనియర్ కటాలో శుచి దండేకర్ స్వర్ణం గెల్చుకొని, కుమిటీలో రజతం సాధించింది.హాసిని సబ్‌జూనియర్ కటా, కుమిటీ విభాగాల్లో కాంస్యాలు గెలుచుకుంది. ఓంకృష్ణ సబ్‌జూనియర్ కటాలో రజతం, ఇర్ఫాన్ నాజర్ బాలుర కటా విభాగంలో రజతం గెల్చుకున్నాడు. శ్రీజన్ సబ్‌జూనియర్ బాలుర కటా విభాగంలో కాంస్యపతకం కైవసం చేసుకున్నాడు.తొమ్మిదిమంది 14 పతకాలు గెలుచుకొని రన్నర్ అప్కప్ సాధించారని కోచ్ జీ.కే. గణేశ్ పేర్కొంటూ వారిని అభినందించారు.