క్రీడలతో మంచి భవిష్యత్:ఎమ్మెల్యే


Mon,November 18, 2019 04:48 AM

దుండిగల్,(నమస్తేతెలంగాణ): ప్రణాళికాబద్ధంగా శ్రమిస్తే క్రీడల్లో రాణించవచ్చని మల్కాజ్‌గిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మేడ్చల్ జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి అంతర్ జిల్లాల అథ్లెటిక్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు ఆదివారం కొంపల్లి పురపాలక సంఘం దూలపల్లిలో అభినందనసభను నిర్వహించారు.ఈ సందర్భంగా క్రీడాకారులకు కుత్బుల్లాపూర్‌కు చెందిన సీనియర్ టీఆర్‌ఎస్ నాయకులు వారాల వినోద్‌కుమార్ ట్రాక్‌సూట్ సహా కిట్లను అందజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తే మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. పోటీలలో విజయం సాధించే విద్యార్థులకు తనవంతు సహకారం అందిస్తానన్నారు. అథ్లెటిక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు స్టాన్లీ జోన్ మాట్లాడుతూ 18వ జాతీయ స్థాయి పోటీలకు మేడ్చల్ జిల్లా నుంచి13 మంది క్రీడాకారులు ఎంపికయ్యారని, 20వ తేదీన తిరుపతిలో జరిగే పోటీలకు వెళ్తారన్నారు. 23 నుంచి 25వ తేదీ వరకు దేశవ్యాప్తంగా జరిగే క్రీడల్లో 5వేల మంది విద్యార్థులు పాల్గొంటున్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...