ఆర్థిక స్వావలంబనే సహకార సంఘాల లక్ష్యం


Mon,November 18, 2019 04:48 AM

శంషాబాద్: దేశ సమగ్రత, ఆర్థిక స్వావలంబన, మాన వ మనుగడతో పాటు శుద్ధి, వృద్ధ్దే సహకార సంఘాల లక్ష్యాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఆదివా రం రంగారెడ్డిజిల్లా శంషా బాద్ మండలం ముచ్చిం తల్ పరిధిలోని స్వర్ణ భార త్ ట్రస్టులో సహకారత భారతి(తెలంగాణ)- సహ కార పరపతి సంఘాల సమ్మేళనం ఘనంగా నిర్వ హించారు. ఈ కార్యక్ర మంలో సహకారత భారతి( తెలంగాణ) స్వాగత సమితి చైర్మన్ ప్రవీణ్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు ఉపేందర్‌రెడ్డి, అఖిల భారత అధ్యక్షులు రమేశ్ వైద్య, ప్రధాన కార్యదర్శి తమ్మి నర్సయ్య, కరణం నవనీత్ నాథ్, సంజీవరెడ్డి, సునీల్‌గుప్తతో పాటు పలువురు పాల్గొన్నారు. సుమారు 200 సహకార సంఘాల నుంచి దాదాపు 1000 మంది హాజరైనారు. ఈ సందర్భంగా ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో సహకార భారతి అతిపెద్ద స్వచ్ఛంద సహకార సంస్థ అని తెలిపారు. సహకార భారతి పర పతి, నేత, మహిళా, గృహ, మత్స్య, స్వయంసహాయక, పారి శ్రామిక, పాడి, వ్యవసాయ, సహకార బ్యాంకులు తదితర 55 రకాల సంఘాల అభివృద్ధ్దితో పనిచేస్తుందని వివరించారు. పెట్టుబడి దారులు, బహుళజాతి సంస్థలకు ధీటుగా సంఘాలు పనిచేస్తు న్నాయన్నారు. భవిష్యత్‌లో సంఘాల పటిష్టతకు సమిష్టిగా ముందుకు సాగాలని పేర్కొన్నారు.

29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles