కలర్ థెరపీ వైద్య విధానం ఉత్తమం


Mon,November 18, 2019 04:47 AM

తెలుగుయూనివర్సిటీ: అతిపురాతనమైన సహజసిద్ధ రంగులతో చేసే వైద్య విధానం కలర్ థెరపీ ద్వారా సర్వవ్యాధులను నయం చేసుకోవచ్చని న్యూఢిల్లీకి చెందిన ప్రఖ్యాత అంతర్జాతీయ కలర్ థెరపీనిపుణులు ప్రొఫెసర్ అజయ్ మిశ్రా వెల్లడించారు. వంశీహోలిస్టిక్ అండ్ హీలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కాన్ఫరెన్స్ హాలులో హీలింగ్ విత్ కలర్స్ పేరుతో నిర్వహిస్తున్న శిక్షణా తరగతుల్లో భాగంగా ఆదివారం అజయ్ మిశ్రా పాల్గొని మాట్లాడుతూ మన పూర్వీకులు ఆచరించిన వైద్య విధానంతో అత్యుత్తమమైన ఫలితాలను పొందారన్నారు. కలర్ థెరపీ అన్ని రకాల వ్యాధులను నయం చేసుకోవచ్చని, ఆక్యుపంక్చర్ వైద్య విధానం ఒక భాగమేనన్నారు. ప్రతి ఒక్కరూ సులువుగా నేర్చుకోవచ్చునని ఆయన స్పష్టం చేశారు. ఒక్కో రంగు ఒక్కో వ్యాధి నివారణకు దోహదం చేస్తుందన్నారు. మానసిక రుగ్మతలను, ఆందోళనలు, అలసట నుంచి కూడా ఉపశమనం పొందవచ్చన్నారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ శిక్షణా శిబిరంలో అజయ్‌మిశ్రా కలర్ థెరపీ గురించి వివరించడంతో పాటు పలు ఆరోగ్య సమస్యలకు ప్రయోగాత్మకంగా ఆయా కలర్ థెరపీ ద్వారా నివారణ కలిగించి ఉపశమనం కలిగించారు. కార్యక్రమంలో సెంటర్ నిర్వాహకులు ఎ.వంశీకృష్ణ పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...