ప్రతి విద్యార్థి జీవితం.. ఓ లైబ్రరీ కావాలి


Tue,November 12, 2019 02:02 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ప్రతి విద్యార్థి కొన్ని వందల పుస్తకాలకు సమానం కావాలని, ఒక్కో విద్యార్థి ఒక గ్రంథాలయంగా అవతరించాలని బీసీ గురుకుల విద్యాలయాల కార్యదర్శి మల్లయ్య భట్టు అన్నారు. మహాత్మా జ్యోతిబాఫూలె తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ - హైదరాబాద్, హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఆధ్వర్యంలో మన్సూరాబాద్ సహారా ఎస్టేట్స్‌లోని గురుకుల విద్యాలయంలో సోమవారం పుస్తక ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ గురుకుల విద్యాలయాల కార్యదర్శి మల్లయ్య భట్టు, హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు జూలూరు గౌరీ శంకర్ ముఖ్యఅతిథులుగా హాజరై పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం మల్లయ్య భట్టు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గురుకుల పాఠశాలల్లో ఈరోజు బుక్ ఫెయిర్ ప్రారంభించడం జరిగిందన్నారు. గురుకులంలో చదివే ప్రతి విద్యార్థి జీవితం ఒక లైబ్రరీ కావాలని తెలిపారు.

అనంతరం హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీ శంకర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు విద్యా సంస్థల్లో సాహితీ, సాంస్కృతిక ఉత్సవాలు, క్రీడోత్సవాలు జరిగాయని, తొలిసారిగా గురుకుల విద్యా వ్యవస్థలో పుస్తక ప్రదర్శనలు జరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అన్ని వర్గాల నుంచి హర్షాతిరేకాలు వస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం ఈ పుస్తక ప్రదర్శనలకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ కార్యదర్శి కోయ చంద్రమోహన్, మన్సూరాబాద్ కార్పొరేటర్ విఠల్ రెడ్డి, సహార స్కూల్ ప్రిన్సిపాల్ పసుపులేటి విద్యాసాగర్, వసుంధర, తదితరులు పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...