గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్టు


Mon,November 11, 2019 12:27 AM

-పరారీలో మరొకరు ..గంజాయి స్వాధీనం
ఉప్పల్, నమస్తే తెలంగాణ : కళాశాల విద్యార్థులే లక్ష్యంగా గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న వ్యక్తులు ఎక్సైజ్ పోలీసులకు చిక్కారు. గంజాయి ప్యాకెట్లను తరలిస్తున్న వ్యక్తులను ఆదివారం ఉప్పల్ ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉప్పల్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్ కథనం ప్రకారం.. మల్లాపూర్ అశోక్‌నగర్, నెహ్రూనగర్ బస్టాప్ ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. టాటా టియాగో వాహనంలో వెళ్తున్న వ్యక్తులు వాహనం నిలుపకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఎక్సైజ్ పోలీసులు వాహనాన్ని అడ్డగించి తనిఖీ చేశారు.

దీంతో వాహనంలో 22 కేజీల గంజాయి ప్యాకెట్లు గుర్తించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు ఫోన్లు, గంజాయి ప్యాకెట్లు, వాహనం స్వాధీనం చేసుకున్నారు. వీరిలో జనగాం జిల్లా పాలకుర్తి మండలం చెన్నూర్‌కు చెందిన నారగాని వెంకటేశ్(24), నారగాని నాగరాజు(20)లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో వ్యక్తి నారగాని సంతోష్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. మేడ్చల్, ఘట్‌కేసర్, ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు చేయడానికి వీటిని తరలిస్తున్నట్లు తెలిసింది. ఈ తనిఖీల్లో ఇన్‌స్పెక్టర్ ఎల్.మహేశ్వర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...