162 బ్రిలియెంట్ ఓపెన్ చెస్ చాంప్ సృజన్ కీర్తన్


Mon,November 11, 2019 12:26 AM

హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి : 162వ బ్రిలియెంట్ ఓపెన్ చెస్ టైటిల్‌ను సృజన్ కీర్తన్ సొంతం చేసుకోగా, జూనియర్ టైటిల్‌ను దోమలగూడ చైతన్య విద్యాలయానికి చెందిన హరీశ్ ఉప్పుగండ్ల కైవసం చేసుకున్నారు. ఆషిష్కాంత్, ఎం.సూర్య రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. దిల్‌సుఖ్‌నగర్ బ్రిలియెంట్ గ్రామర్ హై స్కూల్‌లో జరిగిన ఓపెన్ క్యాటగిరీలో ఆరు రౌండ్‌లో సృజన్ కీర్తన్ 6-5 పాయింట్ల తేడాతో బాసిద్ ఇబ్రహింపై గెలుపొందారు. పెరుమల్లు, షణ్ముఖ, ఎస్.సుబ్బరాజు, రిత్విక్, పి.సతీశ్, ఆశిష్, వర్షిత్, ప్రకాశ్ అగ్రస్థానాల్లో నిలిచారు. అండర్-14 బాలుర విభాగంలో రాహుల్, హిమాకర్, బాలికల విభాగంలో హరి మనసా, భవష్య విజేతలుగా నిలిచారు.

అండర్-12 బాలుర విభాగంలో ఆషిష్యాంత్, సూర్య, బాలికల విభాగంలో అనులేఖ రెడ్డి, వర్షిత విజేతలుగా నిలిచారు. విజేతలకు తెలంగాణ చెస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మేజర్ శివప్రసాద్, నిర్వాహక కార్యదర్శి సుబ్రహ్మణ్యం బహుమతులు అందజేశారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...