స్వచ్ఛ కాలనీలు


Sun,November 10, 2019 02:28 AM

-కాలనీలు, అంతర్గత రోడ్లలో మూడు రోజులకోసారి స్వీపింగ్
-అదనపు కార్మికులతో మెరుగైన సేవలు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:జోన్లవారీగా 401స్ట్రెచ్‌లలో 709కిలోమీటర్లమేర ప్రైవేటుకు అప్పగిస్తున్నారు. దీనివల్ల ఆయా రోడ్లపై స్వీపింగ్ చేస్తున్న కార్మికులను అంతర్గత రోడ్ల స్వీపింగ్‌కు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధాన రోడ్ల పారిశుధ్యం ప్రైవేటు ఏజెన్సీలు చేపట్టడంవల్ల ఒక్కో సర్కిల్‌లో సుమారు 10మంది చొప్పున దాదాపు 300మంది స్వీపర్లు పని కోల్పోతున్నట్లు, దీంతో వారి సేవలను అంతర్గత రోడ్లు, కాలనీ రోడ్లను శుభ్రం చేసేందుకు ఉపయోగించుకుంటామని అధికారులు తెలిపారు. అంతేకాదు, చార్మినార్, బిర్లామందిర్, ట్యాంక్‌బండ్, సెవెన్ టూంబ్స్ తదితర 27పర్యాటక ప్రాంతాల్లో సైతం పారిశుధ్య పనులను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలని నిర్ణయించారు. ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన అధికారులు త్వరలో టెండర్లు పిలిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనివల్ల ఇంతకాలం ఆయా పర్యాటక స్థలాల్లో పనిచేస్తున్న మరో 300 వరకూ స్వీపర్లు పని కోల్పోనున్నారు. దీంతో వారిని కూడా ఇంటర్నల్ రోడ్లు, కాలనీ రోడ్లను శుభ్రం చేసేందుకు తరలిస్తామని అధికారులు తెలిపారు.

ఇతర ప్రదేశాలకు స్వీపర్లు
నగరంలో ప్రధాన రోడ్లు, అంతర్గత రోడ్లు అన్నీ కలిపి దాదాపు 9100కిలోమీటర్లు ఉన్నట్లు అంచనా కాగా, ఇందులో దాదాపు 1000కిలోమీటర్ల వరకూ బస్సులు తిరిగే ప్రధాన రోడ్లున్నాయి. రోడ్లను శుభ్రం చేసేందుకు జీహెచ్‌ఎంసీ దాదాపు 20వేలమంది స్వీపర్ల సేవలు తీసుకుంటున్నది. అయితే, రోజువారీ స్వీపింగ్ పనులు ప్రధాన రోడ్లపైనే కొనసాగుతుండగా, అంతర్గత రోడ్లు, కాలనీ రోడ్లపై స్వీపింగ్ వారానికోసారి జరుగుతున్నది. తాజాగా 709 కిలోమీటర్ల మేర ప్రధాన రోడ్లు, 27 పర్యాటక స్థలాల్లో స్వీపింగ్ పనులను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలని నిర్ణయించడంతో ఇంతకాలం అక్కడ పనిచేసిన స్వీపర్లను ఇతర ప్రదేశాలకు తరలించే అవకాశం ఏర్పడింది.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...