సేవాభావం అభినందనీయం


Sun,November 10, 2019 02:24 AM

యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ: సమాజహితమే లక్ష్యంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్న చామల శారదాదేవి నర్సింహారెడ్డి కుటుంబ సభ్యుల దాతృత్వాన్ని నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి అభినందించారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని శర్భనాపురంలోని సీవీఎన్ పబ్లిక్ రిలేషన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చామల శారదాదేవి తృతీయ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమానికి కట్టా శేఖర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అనేక సేవా కార్యక్రమాలతో సీ.వీ.ఎన్ కుటుంబ సభ్యులు సరికొత్త చరిత్రకు శ్రీకారం పలికిన తీరు మార్గదర్శకంగా ఉందన్నారు. చామల నర్సింహారెడ్డితో తనకు సన్నిహిత సంబంధం ఉందన్నారు. చదువుతూ, రాస్తూ మరణించాలని చెప్పిన మనస్సున్న వ్యక్తి నర్సింహారెడ్డి అన్నారు. డబ్బులు సంపాదించడం పెద్ద విషయం కాదని దాంతో ఏం చేస్తున్నమన్నదే గొప్ప విషయమన్నారు.శారదాదేవి శర్భనాపురం గ్రామానికి గొప్ప విజ్ఞాన కేంద్రం, ఆధ్యాత్మిక మందిరాన్ని అందించారన్నారు. రచన జర్నలిజం స్కూల్ ప్రిన్సిపాల్ ఉమామహేశ్వర్‌రావు మాట్లాడుతూ ప్రజలకు సేవా కార్యక్రమాలు చేపట్టి వారి మన్ననలు పొందిన సీవీఎన్ కుటుంబ సభ్యుల కృషి వల్ల గ్రామ రూపురేఖలు మారుతున్నాయన్నారు.

బహుమతులు ప్రదానం చేసిన కట్టా శేఖర్‌రెడ్డి
వ్యాసరచన పోటీల్లో ప్రథమ బహుమతి కప్ప మనీషా, ద్వితీయ బహుమతి మొగులగాని ప్రవళ్లిక, తృతీయ బహుమతి ఎం.హర్షితకు కట్టా శేఖర్‌ర్డె అందజేశారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ ప్రభుత్వ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ ఎం.వీ గోనారెడ్డి, మండల విద్యాధికారి బచ్చు లక్ష్మీనారాయణ, సర్పంచ్ సిరిగిరి అనితావిద్యాసాగర్, రామకృష్ణ విద్యాలయం ప్రిన్సిపాల్ బండిరాజుల శంకర్, సీనియర్ ఉపాధ్యాయులు గుండు జగన్, ప్రముఖ కవి తిరునగిరి శ్రీనివాస్, సీ.వీ.ఎన్ పబ్లిక్ రిలేషన్స్ ఫౌండేషన్ కార్యదర్శి చామల రవీందర్‌రెడ్డి, జూబ్లీహిల్స్ భారతీయ భవన్ విద్యాభవన్ ప్రిన్సిపాల్ రమాదేవి, సీ.వీ.ఎన్ కుటుంబ సభ్యులు ఎన్‌ఆర్‌ఐ చామల రమేశ్‌రెడ్డి, చామల నీరజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...