కోటి కాంతులు..


Sun,November 10, 2019 02:24 AM

కవాడిగూడ: ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవం కన్నుల పండువగా జరుగుతున్నది. శనివారం మైసూరు అవధూత దత్తపీఠం అధిపతి శ్రీగణపతి సచ్చిదానంద స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివకేశవులకు బేధంలేదు అనడానికి కార్తీక మాసం ప్రతీక అన్నారు. ఈ మాసంలో ప్రశాంతంగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ జ్ఞానజ్యోతులను వెలిగించాలన్నారు. కోటిదీపోత్సవంలో పాల్గొనడం ఒకయోగం, తపస్సు అని పేర్కొన్నారు. కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్ హాజరయ్యారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివనామస్మరణ చేశారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...