హెచ్‌సీయూ విద్యార్థులకు ఆస్ట్రేలియా యూనివర్సిటీ స్కాలర్‌షిప్


Sun,November 10, 2019 02:22 AM

కొండాపూర్ : గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల ప్రతిభను గుర్తించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం స్కాలర్‌షిప్‌ను అందించేందుకు ముం దుకు వచ్చినట్లు హెచ్‌సీయూ పీఆర్‌వో ఆశీష్ జెకాబ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్సిటీలోని లాంగ్వెజ్ సైన్సెస్‌లో ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ అభ్యసిస్తున్న సిమంతికా రాయ్, సోషాలజీ విభాగంలో ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ అభ్యసిస్తున్న అనామిక కట్టుపరంబిల్ హరీశ్‌కుమార్‌ల ప్రతిభను గుర్తించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం యూనివర్సిటీ ఆఫ్ మెల్‌బోర్న్‌లో మాస్టర్స్‌ను అభ్యసించేందుకు అవసరమైన స్కాలర్‌షిప్‌ను అందించేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. జనవరి 2020లో సిమంతికా స్పీచ్ పాథాలజీ, అనామిక సోషల్ పాలసీలో మాస్టర్స్ అభ్యసించనున్నట్లు పేర్కొన్నారు.

27
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...