ఎయిడెడ్ స్కూళ్లకు రూ.10.31 కోట్లు


Sun,November 10, 2019 02:21 AM

-వేతనాలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద నిధులు విడుదల
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : జిల్లాలోని ఎయిడెడ్ స్కూళ్లకు రూ.10.31 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. 2019- 20 విద్యా సంవత్సరానికి గాను వేతనాలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ఈ నిధులు విడుదలయ్యాయి. రాష్ట్రం మొత్తానికి రూ.26కోట్లు విడుదల కాగా, దీంట్లో అధిక మొత్తం 10 కోట్ల నిధులు జిల్లాకే కేటాయించారు. ఎయిడెడ్ విద్యా సంస్థలకు ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్‌ను ప్రభుత్వం విడుదల చేయడం గమనార్హం. వాస్తవికంగా ఇది వరకు ప్రతి మూడు నెలలకొక మారు ఎయిడెడ్ స్కూళ్లకు బడ్జెట్‌ను విడుదల చేసేవారు. బడ్జెట్ విడుదలలో ప్రతిసారీ జాప్యమవుతుండటంతో ఉపాధ్యాయులు, సిబ్బంది తీవ్రమైన ఇబ్బందులు పడేవారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఒకేసారి బడ్జెట్‌ను విడుదల చేస్తున్నారు. జిల్లాలో 112 ఉన్నత పాఠశాలు, 113 ప్రాథమిక పాఠశాలలు, 35 ప్రాథమికోన్నత పాఠశాలల చొప్పున మొత్తం 262 పాఠశాలలున్నాయి. వీటిలో వేలాది మంది ఉపాధ్యాయులతోపాటు సిబ్బంది పని చేస్తున్నారు. ఈ పాఠశాలల్లోని టీచర్లు, సిబ్బంది వేతనాలు, డీఏ, ఏరియర్స్‌ను చెల్లించడం కోసం ఆయా మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. వీటిని పేఅండ్ అకౌంట్స్ ద్వారా బిల్లులు సమర్పించగానే ట్రెజరీ నుంచి జారీ చేయనున్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...