థర్డ్ ఏసీ రైల్వే ప్రయాణంపై ప్రయాణికుల ఆసక్తి


Sat,November 9, 2019 01:14 AM

-త్రీటైర్ ఏసీ బెర్తులకు పెరుగుతున్న డిమాండ్
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : రైలు ప్రయాణికులు ఎయిర్ కండీషన్ ప్రయాణంపైనే ఆసక్తి చూపుతున్నారు. గతంలో జనరల్ కోచ్‌లు, నాన్ ఏసీ స్లీపర్‌బెర్తులకు డిమాండ్ ఉన్నప్పటికీ పరిస్థితి మారి ఏసీ ప్రయాణం వైపు మొగ్గు చూపుతున్నారు. కంఫర్ట్‌జర్నీకి ఏసీ ప్రయాణమే మేలనే అభిప్రాయానికి వచ్చిన ప్రయాణికులు నాన్ ఏసీని కాదని ఏసీని ఎంచుకుంటున్నట్లు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. దక్షిణ మధ్య రైల్వే ఈ విషయాన్ని అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. ప్రయాణికుల ఆలోచనలకు అనుగుణంగా ఏసీ బెర్తులను పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. అందులో భాగంగా నాన్ ఏసీ స్లీపర్‌క్లాస్ బోగీలను తగ్గించింది. ఇటీవల చార్మినార్ ఎక్స్‌ప్రెస్ 24 బోగీలను 22 బోగీలకు కుదించారు. అయితే బోగీలు కుదించినప్పటికీ నాన్ ఏసీని తగ్గించి థర్డ్ ఏసీ బోగీలకు ప్రాధాన్యత కల్పించారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రెగ్యులర్ రైళ్లతోపాటు 1647 ప్రత్యేక రైళ్లు నడిపిస్తుండగా, 2018-19 ఆర్థిక సంవత్సరంలో 2341 ప్రత్యేక రైళ్లను నడిపించారు.

వీటితోపాటు ప్రస్తుత సంవత్సరం కూడా అత్యధిక ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నారు. ఇందులో 20 శాతం బోగీలను ఎయిర్‌కండీషన్ బోగీలను ఏర్పాటు చేశారు. దీనివల్ల 2017-18తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరం 15.6 శాతం ఆదాయం సమపార్జించిందని స్వయంగా దక్షిణమధ్య రైల్వే వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే 26 శాతం పెరిగే అవకాశముందని చెబుతున్నారు. నాన్ ఏసీ స్లీపర్‌క్లాస్‌తో పోల్చితే థర్డ్‌ఏసీ చార్జీ కేవలం 35 శాతం మాత్రమే ఎక్కువగా ఉండటంతోపాటు సౌకర్యాలు బాగుండటంతో ప్రయాణికులు థర్డ్‌ఏసీ వైపు చూస్తున్నారు. ఏసీ కోచ్‌లో ప్రయాణ భద్రతతోపాటు పడుకోవడానికి వీలుగా శుభ్రమైన బెర్తులు, కప్పుకోవడానికి బ్లాంకెట్ వంటి సౌకర్యాలుంటాయి. దీంతో చాలా మంది ప్రయాణికులు థర్డ్ ఏసీకే ప్రాధాన్యత ఇస్తున్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...