నిమ్స్‌ను సందర్శించిన ప్రభుత్వ విప్ సునీత


Sat,November 9, 2019 01:11 AM

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: నిమ్స్ దవాఖానలోని డయాలసిస్ విభాగాన్ని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి శుక్రవారం సందర్శించారు. రోగులకు అందుతున్న సేవలను, వార్డులను పరిశీలించారు. దవాఖానలో చికిత్స పొందుతున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులతో ఆమె ముచ్చటించారు. ఆలేరులో త్వరలో నెలకొల్పే డయాలసిస్ సెంటర్‌కు కావాల్సిన మౌలిక సదుపాయాలపై నిమ్స్‌లోని నెఫ్రాలజీ విభాగం ప్రొఫెసర్ తాడూరి గంగాధర్‌తో ఆమె చర్చించారు. డయాలసిస్ సెంటర్‌కు కావాల్సిన పరికరాలు, ఇతర సామగ్రి, అందుకయ్యే ఖర్చు గురించి అడిగి తెలుసుకున్నారు. కిడ్నీ వ్యాధులతో రోగులు పడే బాధలేమిటో తన తండ్రి అనుభవించిన కష్టాల ద్వారా తెలుసుకున్నానని, తన నియోజకవర్గంలో ప్రత్యేక చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...