గ్రేటర్‌లో రోడ్డెక్కిన 1689 ఆర్టీసీ బస్సులు


Sat,November 9, 2019 01:11 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : కార్మికుల సమ్మె జరుగుతున్న నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1689 బస్సులను శుక్రవారం నడిపించారు. సమ్మె నేపథ్యంలో నగర ప్రజలకు ప్రయాణ సౌకర్యానికి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో అధికారులు ఏర్పాట్లు చేసి రూట్లను నడిపారు. ముఖ్యంగా కాలనీల నుంచి బస్సులను ఆపరేట్ చేస్తూ ముఖ్య రహదారులకు, ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచారు. మెట్రోరైలు నడిచే మార్గాల్లో బస్సుల సంఖ్యను కుదించి ఇతర మార్గాల్లో ఆపరేట్ చేశారు. నగరంలో ఆర్టీసీ బస్సులు తిరుగుతుండటంతో సమ్మె జరుగుతున్నదన్న భావన ప్రజల్లో కనిపించలేదు. ఆటోరిక్షాలు, క్యాబ్‌లు, ప్రైవేటు బస్సులు, సెట్విన్ సేవలు అందించగా, చాలా మంది వ్యక్తిగత వాహనాలను రోడ్ల మీదకు తెచ్చారు. నగరంలో ప్రయాణ సౌకర్యం ఎటువంటి ఇబ్బంది లేకుండా అందుతుండటంతో సమ్మెలో కార్మికులున్నప్పటికీ రోజువారీ విధులకు ఆటంకం కలుగడం లేదు. గ్రేటర్ పరిధిలో 29 డిపోలు ఉండగా, ప్రతీ డిపో నుంచి బస్సులు నడుస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...