భారతీయులు బానిసత్వానికి గురికావొద్దు


Fri,November 8, 2019 12:31 AM

తార్నాక : భారతీయులు విదేశీయుల బానిసత్వానికి గురి కారాదని యునైటెడ్ స్టేట్ అడ్వైజరీ కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ మెంబర్ హేరాల్డ్ డిసౌజా అన్నారు. గురువారం లిటిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తార్నాకలో ఆంటీ ట్రాఫికింగ్ హోప్ ఫర్ ఫ్రీడమ్ అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హేరాల్డ్ డిసౌజా పాల్గొని మాట్లాడుతూ అనేక మంది భారతీయులు విదేశాలకు వెళ్లి అక్కడి చట్టాలపై అవగాహన లేని కారణంగా లేనిపోని ఇబ్బందులకు గురై వారికి బానిసత్వంగా మారిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమాయకులతో వెట్టిచాకిరీ చేయిస్తూ మానసికంగా, శారీరంగా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో లిటిల్ సోలర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ ఉదయ్‌రాయ్ భూషణ్, వెల్సన్ తదితరులు పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...