పెసపాల్లో వరల్డ్ కప్‌లో తెలంగాణ సత్తా నిరూపించాలి


Fri,November 8, 2019 12:30 AM

కాచిగూడ : చిన్నతనం నుంచే విద్యార్థులు బేస్‌బాల్, సాఫ్ట్‌బాల్‌ను నేర్చుకోవడం ద్వారా ప్రపంచ స్థాయి గుర్తింపు లభిస్తుందని తెలంగాణ పెసపాలో అసోసియేషన్ అధ్యక్షుడు రేణుకాదాస్ జాన్‌వడ్‌కార్ అన్నారు. ఈనెల 26 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు పుణెలో జరుగనున్న 11వ పెసపాల్లో వరల్డ్‌కప్-2019లో రాష్ర్టానికి చెందిన 7 మంది బాలురు, ఇద్దరు బాలికలు ఎంపికైనట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా 2016 నుంచి పెసపాల్లో క్రీడాల్లో పాల్గొన్న, పుణేలో జరిగే వరల్డ్ కప్‌లో పాల్గొననున్న క్రీడాకారులు, వారి కుటుంబ సభ్యులను గురువారం తెలంగాణ పెసపాల్లో అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించి, సమారో అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం రేణుకాదాస్ జాన్‌వడ్‌కార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పెస పాల్లో వరల్డ్ కప్ క్రీడల్లో పాల్గొని తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పడానికి ప్రతి క్రీడాకారుడు బాధ్యతగా కృషి చేయాలన్నారు. ఫైనల్ సెలక్షన్స్ ఈనెల 19 నుంచి 23 వరకు ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరుగనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి జయదీప్ లకాణి, కోశాధికారి ఓంకార్ జన్వాడ్కర్, ఆర్‌ఎస్‌ఎస్ నగర ప్రతినిధి దిలీప్‌శాహాని, రాంరెడ్డి, శాంతి స్వరూప్, జీహెచ్‌ఎంసీ ఓఎస్‌డీ ప్రేమ్‌రాజ్, శ్రీనివాస్‌నాయుడు, బద్రుక కళాశాల ప్రిన్సిపాల్ సోమేశ్వర్‌రావు, డాక్టర్ సునీల్‌బిడ్లా, పట్నం యాదయ్య, ఎం.రాజేశ్ పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...