గురునానక్ మార్గం అనుసరణీయం


Fri,November 8, 2019 12:28 AM

మారేడ్‌పల్లి: సికింద్రాబాద్ గురుద్వార్ ప్రబంధక్ కమిటీ ఆధ్వర్యంలో సిక్కు మత వ్యవస్థాపకులు గురునానక్ 550వ జయంతిని ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ గురునానక్ మార్గం అనుసరణీయమని అన్నారు. వందలాది మంది సిక్కులు ర్యాలీలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు, కీర్తలను ఆలపించారు. గురుద్వార్ మందిరం నుంచి పువ్వులతో ముస్తాబు చేసిన వాహనంలో సిక్కుల పవిత్ర గ్రంథం గురుగ్రంథ్‌ను పెట్టి పాటలు పాడుతూ.. ర్యాలీ కన్నుల పండువగా నిర్వహించా రు. సిక్కు యువకుల గట్కా స్కిల్స్, మార్షల్ ఆర్ట్స్ ఆకట్టుకున్నాయి. చిన్నారుల సాహసాలు అలరించాయి. ప్రకాశ్ ఉత్సవ్ పేరుతో జరిగిన ఈ ర్యాలీ రెజిమెంటల్‌బజార్‌లోని గురుద్వార్ మందిరం నుంచి ప్రారంభమై క్లాక్‌టవర్, ప్యాట్నీ, ఆర్పీరోడ్, బాటా షో రూం, సుభాష్‌రోడ్డు, మోండా మార్కెట్ మీదుగా గురుద్వారా మందిరానికి చేరుకుంది. గోపాలపురం, మార్కెట్ పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రబంధక్ కమిటీ అధ్యక్షుడు బల్దేవ్ సింగ్ బగ్గా, ప్రధాన కార్యదర్శి గురుచరణ్ సింగ్ బగ్గా, అవతార్ సింగ్ బగ్గా, జోగిందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...