ఇక గాలి శుద్ధి


Thu,November 7, 2019 02:47 AM

-నగరంలో 100 ఎయిర్ ప్యూరిఫయర్స్ ఏర్పాటు!
-నేడు స్థాయీసంఘం ముందుకు ప్రతిపాదన
-పీసీబీలో ఎన్విరోకేర్ సెంటర్
-వాయుకాలుష్యం, వ్యర్థజలాలలపై నిరంతర నిఘా
-పర్యవేక్షణకు ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్
-ఉల్లంఘనలు జరిగితే అలారంతో అప్రమత్తం

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: గ్రేటర్‌లో ఏ ప్రాంతంలో అత్యధిక వాయుకాలుష్యం నమోదవుతోంది.. ఎక్కడ కాలుష్యమేఘాలు కమ్ముకున్నాయో.. కావాలంటే ఇక నుంచి క్షణాల వ్యవధిలోనే తెలుసుకోవచ్చు. ఏ పరిశ్రమల నుంచి కాలుష్యం వెలువడుతున్నదో.. ఎవరు నిబంధనలు అతిక్రమించారో ఇట్టే పట్టేయొచ్చు. అంతేకాదు ఆయా పరిశ్రమలకు ఆధారాలతో సహా నోటీసులు జారీచేసి చర్యలు తీసుకోవచ్చు. ఇలాంటి హెచ్చరికలు జారీచేసే, కాలుష్యాన్ని అదుపుచేసే ఎన్విరో కేర్ సెంటర్ పీసీబీలో సేవలందిస్తున్నది. ఇలా 325 పరిశ్రమలకు సంబంధించిన కాలుష్యాన్ని పీసీబీ అధికారులు పర్యవేక్షణ జరుపుతున్నారు.

రూ. 40 లక్షల వ్యయంతో..
సాంకేతిక పరిజ్ఞానం, అత్యాధునిక పద్ధతులతో సొగబులద్దుకుంటున్న పీసీబీలో ఎన్విరో కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. కాలుష్య గణాంకాలను లెక్కలను ఎప్పటికప్పుడు అందించేందుకు వీలుగా ఈ సెంటర్‌ను నెలకోల్పారు. రూ. 40లక్షలు వెచ్చించి ఈ ఎన్విరోకేర్ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
పొగగొట్టాలు, వాయుకాలుష్యం, వ్యర్థజలాలలపై నిరంతర నిఘా పెట్టేందుకు ప్రతి రాష్ట్రంలో ఎన్విరో కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర కాలుష్య నియంత్రణా మండలి(సీపీసీబీ) రాష్ర్టాలను ఆదేశించింది. దీంతో చర్యలు తీసుకున్న అధికారులు ఎన్విరోకేర్ సెంటర్‌ను దశల వారీగా ఏర్పాటు చేసి పర్యవేక్షణ జరుపుతున్నారు.

సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానం..
ఎన్విరోకేర్ సెంటర్‌ను కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలతో పాటు.. గ్రేటర్‌లోని కాలుష్య నమోదు కేంద్రాలను ఈ సెంటర్‌తో అనుసంధానం చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేకించి సాఫ్ట్‌వేర్‌ను తయారు చేయించారు. పూణేకు చెందిన యాక్సెంట్ ఇంటెల్లిమేషన్ సంస్థ నుంచి కేంద్రీకృత సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేశారు. ఈ సాఫ్ట్‌వేర్ ఆధారంగా కాలుష్య తీవ్రతల్లో పెరుగుదల నమోదు కాగానే ఆయా అధికారులను అప్రమత్తం చేసేలా ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఇలా ప్రస్తుతానికి 325 పరిశ్రమలను అనుసంధానం చేసి పర్యవేక్షిస్తున్నారు. ఇక పీసీబీ నేతృత్వంలో నడుస్తున్న కాలుష్య నమోదు కేంద్రాలను సైతం అనుసంధానించారు.

ఎప్పటికప్పుడు అప్రమత్తం..
ఏదేనీ పరిశ్రమల నుంచి అత్యధిక కాలుష్యం వెలువడినట్లయితే ఎన్విరోకేర్ సెంటర్ నుంచి అప్రమత్తం చేస్తారు. ఉల్లంఘన జరుగగానే వెంటనే అలారం వస్తుంది. ఎంత సేపు కాలుష్యం వెలువడింది. హెచ్చరిస్తే సర్దుబాటు చేశారా లేదా అన్నది పర్యవేక్షిస్తారు. అప్రమత్తం చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరించినా సంబంధిత పరిశ్రమలను టాస్క్‌ఫోర్స్ సమావేశాలకు పిలిచి సమీక్షిస్తారు. అయినా తదేకంగా ఉల్లంఘిస్తే సంబంధిత రీజియన్ల అధికారులచే నోటీసులు జారీచేస్తారు. అయినా స్పందించకపోతే ఆయా పరిశ్రమను మూసివేయడానికి వెనుకాడరు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...