నేటి నుంచి బాలల వారోత్సవాలు


Thu,November 7, 2019 02:43 AM

మేడ్చల్ కలెక్టరేట్/రంగారెడ్డి జిల్లా,నమస్తే తెలంగాణ: మేడ్చల్,రంగారెడ్డి జిల్లాలో బాలల హక్కుల దినోత్సవంలో భాగంగా ఈనెల 7 నుంచి 14 వరకు బాలల వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల సంక్షేమ శాఖ అధికారి స్వరూపరాణి,జిల్లా స్త్రీ,శిశు మహిళా సంక్షేమాధికారి మోతి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని పలు పాఠశాల్లో బాలలహక్కులపై పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని, విద్యార్థినీ,విద్యార్థులకు పలు రకాల పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. బాలల హక్కులు, సదుపాయాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని హయత్‌నగర్‌లోని రోడ్డు నంబర్1లో ఉన్న విహార్ కాలనీ,సాయి బాబా గుడి దగ్గర పసుమాములలోని అంజనీదేవి చారిటబుల్ ట్రస్ట్‌లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా స్త్రీ,శిశు మహిళా సంక్షేమాధికారి తెలిపారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...