సికింద్రాబాద్‌లో మాజీ సైనిక శిబిరం


Thu,November 7, 2019 02:43 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: సైనిక సంక్షేమశాఖ హైదరాబాద్,రంగారెడ్డి రీజియన్స్ ఆధ్వర్యంలో బుధవారం సికింద్రాబాద్‌లోని వాయుపురి కమ్యూనిటీహాల్లో మాజీ సైనిక శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ సైనిక సంక్షేమశాఖ సంచాలకులు కల్నల్ పి. రమేశ్‌కుమార్ ప్రారంభించి మాట్లాడారు. మాజీ సైనికులు, సైనిక వితంతువుల సౌకర్యార్థం, కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా, ఈ శిబిరాన్ని నిర్వహించామన్నారు. దీంట్లో భాగంగా మాజీ సైనికుల వివరాలను నవీకరించడం, పాత గుర్తింపు కార్డులకు బదులుగా కొత్తవి జారీచేయడం, మాజీ సైనికులపై ఆధారపడిన వారికి డిపెండెంట్‌కార్డులను జారీచేశామన్నారు. దీంతో పాటు మాజీ సైనికులు, సైనిక కుటుంబాలకు వర్తించే రాయితీలు, పథకాలపై అవగాహన కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ సైనిక సంక్షేమాధికారి నోరి శ్రీనేష్‌కుమార్, వాయుపురి కాలనీ అధ్యక్షుడు వింగ్ కమాండర్ టీజేరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...