పార్లమెంట్‌లో న్యాయవాదుల రక్షణ చట్టాన్ని ప్రవేశ పెట్టాలి


Thu,November 7, 2019 02:42 AM

హిమాయత్‌నగర్: న్యాయవాదుల రక్షణ చట్టాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని తెలంగాణ జూనియర్ అడ్వకేట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జెక్కుల వంశీకృష్ణ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం నారాయణగూడలోని అసోసియేషన్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల ఢిల్లీలోని తీస్ హాజారీ కోర్టు వద్ద ఓ న్యాయవాదిపై పోలీస్ అధికారి దాడి చేయడం దురదృష్టకరమని,ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.ఘటనలో గాయపడిన అడ్వకేట్లకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వడంతో పాటు లాయర్ల పరిరక్షణ చట్టం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.ఈ సమావేశంలో అసోసియేషన్ నాయకులు రవికాంత్, టి.ప్రశాంత్, రాజ్‌ప్రకాశ్, శ్రీనివాస్,యం.ప్రశాంత్‌లు పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...