అంగన్‌వాడీలకు పెండింగ్ బిల్లులు చెల్లించాలి


Thu,November 7, 2019 02:42 AM

ఖైరతాబాద్: అంగన్‌వాడీ టీచర్ల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరుతూ టీఆర్‌ఎస్‌కేవీ అనుబంధ తెలంగాణ అంగన్‌వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి నేతృత్వంలో బుధవారం మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ విజయేంద్ర బోయికి ఆమె ఛాంబర్‌లో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నల్ల భారతి మాట్లాడుతూ మార్చి 23న నిర్వహించిన గ్రీవెన్స్ రిడ్రెసల్ కమిటీలో చర్చించిన సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. గ్రేడ్-2 సూపర్‌వైజర్ నియామకం వెంటనే చేపట్టాలని, కనీస వేతనం రూ.18వేలు చెల్లించాలని, ఐసీడీఎస్‌లో వస్తున్న మార్పులకు అనుగుణంగా పనిచేసేందుకు 40 సంవత్సరాలుగా పనిచేస్తున్న టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.5లక్షలు, ఆయాకు రూ.2.50లక్షలు కల్పించాలని కోరారు. పెన్షన్, బీమా, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలన్నారు. గత రెండు సంవత్సరాల నుంచి పెండింగ్‌లో ఉన్న టీడీ, డీఏలను చెల్లించాలని, ఈ సంవత్సరం మార్చి నుంచి కూరగాయలు, గ్యాస్ బిల్లులు, ఇంటి అద్దెలు చెల్లించాలని, అంగన్‌వాడీల వేతనంతో పాటు బిల్లులు కూడా ఆన్‌లైన్‌లో చెల్లించాలన్నారు. యూనిఫామ్ కోసం కలర్ కోడ్ ఇచ్చి డబ్బులు చెల్లించాలని, జీవో నం.14 సవరించి పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. డైరెక్టర్‌ను కలిసిన వారిలో వేదవతి, నాగలక్ష్మి , అనిత తదితరులు ఉన్నారు.

27
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...