ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి


Thu,November 7, 2019 02:41 AM

చార్మినార్ : ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సూచించారు. బుధవారం ఉర్థూఘర్‌లో మిలాద్ ఉల్ నబీ సందర్భంగా నిర్వహించిన పీస్ కమిటీ సమావేశానికి సీపీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పాతనగరం సమ్మిళిత ప్ర పంచమని తెలిపారు. పాతనగరంలో నిర్వహించే ఉత్సవాలను ఇరువర్గాల ప్రజలు సంయమనంతో ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ నిర్వహించుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. ఇదే ఒరవడి భవిష్యత్తులోనూ కొనసాగే విధంగా ప్రతి ఒక్కరూ కంకణబద్ధులుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ బాబూరావు, దక్షిణ మండల అదనపు డీసీపీ రఫీక్, చార్మినార్ ఏసీపీ అంజయ్య, హుస్సేనిఅలం ఇన్‌స్పెక్టర్ కొత్వాల్ రమేశ్, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...