ఘట్కేసర్ : విద్యార్థులు క్రీడల్లో రాణించాలని ఎంపీపీ వై. సుదర్శన్‌రెడ్డి అన్నారు. అంకుశాపూర్‌లోని తెలంగాణ గురుకుల రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాలల ఆధ్వర్యంలో నిర్వహించిన 4 వ రాష్ట్ర స్థాయి క్రీడాపోటీలు ముగింపు సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా పలు క్రీడాపోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు ట్రోఫీలు ప్రదానం చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ అరుంధతి మాట్లాడుతూ క్రీడాపోటీల్లో ఓవర్ చాంపియన్‌గా భువనగిరి కళాశాల గెలుపొందిందని తెలిపారు. కబడ్డీ విభాగంలో ప్రథమ స్థానం భూపాలపల్లి జట్టు, ద్వితీయ స్థానంలో భువనగిరి, ఖో ఖో పోటీల్లో ప్రథమ స్థానం భువనగిరి, ద్వితీయ స్థానం జగద్గిరిగుట్ట కళాశాల, వాలీబాల్‌లో ప్రథమ స్థానం కామారెడ్డి, ద్వితీయ స్థానం మహబూబ్‌నగర్, హ్యాండ్‌బాల్‌లో ప్రథమ స్థానం భువనగిరి జట్టు, ద్వితీయ స్థానం బుద్వేలు కళాశాల జట్టు, టెన్నికాయిట్‌లో ప్రథమ స్థానం ఖమ్మం జట్టు, ద్వితీయ స్థానం మహేంద్ర హిల్స్ కళాశాల జట్టు, క్యారమ్‌లో ప్రథమ స్థానం కె. ప్రవల్లిక, కె. శిరీషా, ద్వితీయ స్థానంలోప్రమీల, విహారిక, చెస్‌లో ప్రథమ స్థానం జి. వైష్ణవి, ద్వితీయ స్థానం సుధా గెలుపొందినట్లు తెలిపారు. గురుకుల డీగ్రీ కళాశాల ఓఎస్డీ. బి.మారుతిరావు, జోనల్ క్రీడా కో ఆర్డినర్ నరేందర్‌రెడ్డి, ప్రమోద్‌కుమార్, శేషుకుమారి, సర్పంచ్ కె. జలజ, ఎంపీటీసీ కె. శోభారాణి పాల్గొన్నారు.