రాంగ్‌రూట్‌లో వెళ్తే రూ.1000 జరిమానా


Sun,October 20, 2019 03:22 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: రాంగ్‌రూట్‌లో ప్రయాణిస్తూ ఇతర వాహనదారులకు ప్రమాదకరంగా మారుతున్న వాహనదారులపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తున్నారు. రాంగ్‌రూట్‌లో వీరి డ్రైవింగ్ చాలా డేంజరస్‌గా మారిందని ట్రాఫిక్ పోలీసులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో రాంగ్ రూట్ డ్రైవింగ్‌తో ప్రమాదాలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ప్రత్యేక కార్యాచరణను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రూపొందించారు. దీంట్లో భాగంగా సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో రాంగ్ రూట్లు ఉన్న ప్రాంతాలను శోధించారు. అధికంగా రాంగ్‌రూట్ డ్రైవింగ్ జరుగుతున్న దాదాపు 20 ప్రదేశాలను ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. ఆ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిబంధనలను ఉల్లంఘించి ప్రయాణించి ఇతర వాహనదారులను ప్రమాదంలోకి నెట్టుతున్న వాహనదారులను గుర్తిస్తున్నారు. అక్టోబరు 1వ తేదీ నుంచి ప్రారంభమైన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సీసీ కెమెరాల నిఘాకు దాదాపు ప్రతిరోజూ 400మంది రాంగ్‌రూట్‌లో ప్రయాణిస్తూ నిబంధనలను ఉల్లంఘిస్తూ దొరికిపోతున్నారు. ఈ దృశ్యాలతో వాహనదారులు రాంగ్‌రూట్‌లో ప్రయాణించినందుకు కేసు నమోదు చేసుకుని రూ.వెయ్యి రుపాయలను జరిమానాగా విధిస్తున్నారు. మాదాపూర్ ఎన్‌ఐఏ బిల్డింగ్, గచ్చిబౌలీ జంక్షన్, మియాపూర్ నుంచి బీహెచ్‌ఈఎల్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో 20 రాంగ్‌రూట్ హాట్‌స్పాట్లు ఉన్నాయి. తొందరగా వెళ్లాలని, అక్కడ ఉన్న ట్రాఫిక్ పరిస్థితులు, యూటర్న్‌లతో దూరం ప్రయాణించడంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వాహనదారులు రాంగ్‌రూట్‌లో ప్రయాణిస్తున్నారని తేలింది.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...