పోషకాహార లోపాన్ని జయించాలి


Sat,October 19, 2019 01:35 AM

తార్నాక, అక్టోబర్18: ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం తార్నాకలోని జాతీయ పోషకహార సంస్థ(ఎన్‌ఐఎన్)ల ఓపెన్ డే వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై వివిధ పరిశోధనలను, ల్యాబ్‌లు, ఇతర మౌలిక వసతులతో పాటు సాధించిన విజయాలపై ఆరాతీశారు. ఈ సందర్భంగా మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ అత్యధికంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేదలు నివాసముంటున్నారని, వారిలోనే సుమారు 30 నుంచి 40 శాతం పసిపిల్లలు పోషకాహారలోపంతో జన్మిస్తున్నారని గణాంకాల ద్వారా తెలుస్తుందన్నారు. పుట్టిన బిడ్డలు ఆరోగ్యవంతమైన జీవనం కొనసాగించినప్పుడే ఆరోగ్యవంతమైన దేశం సాధ్యమని అభిప్రాయపడ్డారు. ఎన్‌ఐఎన్‌లో శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనల ద్వారా పలు అంశాలను న్యూట్రీషియన్ ఇండియా దిశగా అడుగులు వేయడం హర్షణీయమన్నారు. రానున్న రోజుల్లో న్యూట్రీషియన్ ఇండియాపై ప్రధాని ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్‌ను పాటించాలి. ఆదిశగా కార్యక్రమాలను రూపకల్పన చేయాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని శాఖలను బలోపేతం చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...