19, 20 తేదీల్లో హ్యాకథన్


Thu,October 17, 2019 12:35 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్, సైబరాబాద్ పోలీసులు సంయుక్తంగా ఈ నెల 19, 20 తేదీల్లో దాదాపు 30 గంటల పాటు హ్యాకథన్ నిర్వహిస్తున్నారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అంశాలపై ఈ హ్యాకథన్ నిర్వహిస్తున్నారు. 19న ఉదయం 9 గంటలకు టీ హాబ్ ట్రిపుల్ ఐటీ జంక్షన్ నుంచి ప్రారంభమై... 20న సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఈ హ్యాకథన్‌లో హైదరాబాద్, పుణె, చంఢీఘర్, బెంగళూరు ప్రాంతాలకు చెందిన ఐటీ నిపుణులు, ట్రాఫిక్ వాలంటీర్లు, స్టార్ట్ అప్స్ ప్రతినిధులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు పాల్గొంటారు. సైబరాబాద్ ఐటీ కారిడార్‌లో రోడ్డు భద్రత, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అంశాలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలతో వాటి పరిష్కారానికి సరికొత్త ఐడియాలను స్వీకరించనున్నారు. ఈ హ్యాకథన్‌లో జ్యూరీ సభ్యులుగా సైబరాబాద్ సీపీ సజ్జనార్, హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ అనిల్‌కుమార్, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్, ఎస్‌ఎస్‌సీ ప్రధాన కార్యదర్శి కృష్ణ ఏదుల, సంయుక్త కార్యదర్శి వెంకట్ టంకశాలతో పాటు పలువురు ప్రతినిధులు ఉండనున్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...