అక్రమార్జనకు అర్రులుచాస్తున్న ఇంజినీర్లు


Thu,October 17, 2019 12:34 AM

బోర్డు ఇంజినీర్లు అక్రమమార్గంలో సంపాదన కోసం అర్రులుచాస్తున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలకు అనుమతులు ఇప్పించడంతోపాటు, అక్రమ నిర్మాణాలకు వత్తాసు పలుకుతూ పెద్దఎత్తున ముడుపులు దండుకుంటున్నట్లు ఆరోపించా రు. ప్రైవేటు వ్యక్తులను ఏజెంట్లుగా నియమించుకొని బోర్డు ఇంజినీర్లు అక్రమ కట్టడాల వద్ద వసూళ్లకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. అన్ని ఆధారాలతో సీపీఐ అధికారులకు ఫిర్యాదు చేశానని, అయితే లెటర్‌హెడ్ మీద ఫిర్యాదు చేయాలని సీబీఐ అధికారులు తనకు సూచించారని తెలిపారు. రెండు,మూడు రోజుల్లో తన లెటర్‌హెడ్ మీద పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేయనున్నట్లు కేశవరెడ్డి స్పష్టం చేశారు. గతంలో జరిగిన దాడులకు భిన్నంగా అన్ని ఆధారాలతో రైడ్ జరగనున్నట్లు తెలిపారు. ఈసారి అన్ని ఆధారాలతో సీబీఐకి ఫిర్యాదు చేశానని, అవసమైన ఒరిజినల్ డాక్యుమెంట్లను సమర్పిస్తానన్నారు. బోర్డు ఇంజినీర్లతోపాటు ఇతర విభాగాలకు చెందిన అధికారులు సైతం ఏజెంట్లను నియమించుకొని వసూళ్లకు పాల్పడుతున్నారని, ఆ జాబితాను కూడా సీబీఐ అధికారులకు అందజేసినట్లు తెలిపారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...