టేబుల్ టెన్నిస్ స్టేట్ ఛాంపియన్‌గా జక్కాల గౌరి


Thu,October 17, 2019 12:32 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : నగరానికి చెందిన జక్కాల గౌరి టేబుల్ టెన్నిస్ అండర్ 15 సబ్ జూనియర్స్ స్టేట్ ఛాంపియన్‌గా నిలిచింది. అన్ని రౌండ్లల్లో ప్రత్యర్థులను మట్టికరిపించి స్టేట్ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు మహవీర్ గ్రూప్‌కేశవగిరిలోని ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో సంరెడ్డి సుదర్శన్‌రెడ్డి మెమోరియల్ 6వ తెలంగాణ స్టేట్ స్టాగ్ అండ్ మహ వీర్ అంతర్‌జిల్లా, స్టేట్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌ను నిర్వహించారు. ఈ పోటీల్లో అండర్ 15 సబ్ జూనియర్స్ కేటగిరిలో తలపడ్డ గౌరి, ప్రత్యర్థులందరిని ఓడించింది. ఫైనల్లో పూజపై విజయసాధించి, స్టేట్ ఛాంపియన్‌గా నిలిచింది. నగరానికి చెందిన కూకట్‌పల్లిలోని ఎంఎల్‌ఆర్ అకాడమీలో శిక్షణపొంది, రాటుదేలిన గౌరి పోటీల్లో భాగంగా ఆది నుంచి తన అధిపత్యాన్ని ప్రదర్శించి విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా బుధవారం నిర్వహించి బహుమతుల ప్రదానో త్సవంలో నిర్వాహకుల నుంచి షీల్డ్‌లను అందుకుంది. ఈ సందర్భంగా కోచ్ సోమనాథ్ ఘోష్, తల్లిదండ్రులు జక్కాల గురులింగం, రేణుకలు గౌరిని ప్రత్యేకంగా అభినందించారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...