ఓటరు జాబితాలో తప్పులుండొద్దు


Wed,October 16, 2019 12:37 AM

మేడ్చల్ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి : తప్పులు లేకుండా ఓటర్ జాబితాను రూపొందించాలని కలెక్టర్ డా.ఎంవీ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలతో ఓటర్ జాబితా సవరణలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్ పోలింగ్ కేంద్రాల వారీగా ఓటరు జాబితా రిజిస్టర్‌ను సరిచూసుకోవాలన్నారు. బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్లు ఇంటింటికి వెళ్లి ఓటరు సవరణ చేయాలని, తప్పులు కూడా సరిచేయాలని సూచించారు. చనిపోయిన వారి, డూప్లికేట్ ఓట్లను వెంటనే తొలిగించాలన్నారు.రెండు రోజుల్లో ఓటరు జాబితాను వందశాతం పూర్తి చేయాలన్నారు. ఈఆర్‌ఓలు, ఏఆర్‌ఓలు, సిటిజన్ సర్వీసు సెంటర్లు, మీ సేవా కేంద్రాలను వినియోగించు కోవాలని చెప్పారు. కంప్యూటర్ ఆపరేటర్లను వినియోగించుకొని వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. జేసీ విద్యాసాగర్, డీఆర్‌ఓ మధుకర్‌రెడ్డి, డీపీవో రవికుమార్, మహిళాశిశు సంక్షేమ శాఖ అధికారి స్వరూపారాణి, బీసీ వెల్ఫేర్ అధికారి వెంకటేశ్వరి, డీఆర్‌డీఓ కౌటిల్య, ఎం.విజయలక్ష్మి పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...