బస్సులన్నీ నడిచేలా ఏర్పాట్లు చేయాలి


Tue,October 15, 2019 04:01 AM

ప్రతి ఆర్టీసీ డిపోలోని బస్సులన్నీ నడిచేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డా.ఎంవీ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ సమ్మె, ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో జిల్లా పరిధిలోని డిపో మేనేజర్లు, రవాణా, పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్ బస్సు డిపోలకు అవసరమైన మెకానిక్‌లను ఐటీఐ కళాశాలల నుంచి సమకూర్చుకోవాలని, జిల్లాలో ఎన్ని బస్సులు నడస్తున్నాయో ఖచ్చితమైన నివేదిక అందించాలన్నారు. డిపోల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, భద్రతలో భాగంగా డిపోల వద్ద విధులు నిర్వహిస్త్తున్న పోలీసులకు వసతులు కల్పించాలన్నారు.

వివిధ శాఖలలో విధులు నిర్వహిస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లను ఆర్టీసీ డిపోల్లో విధులు నిర్వహించేందుకు పంపామని తెలిపారు. ఐటీఐ చదివిన విద్యార్థుల వివరాలను అందించాలని ఐటీఐ కళాశాలల ప్రిన్సిపాల్స్‌ను కలెక్టర్ కోరారు. ఆకస్మిక తనిఖీలు చేస్తామని, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలుంటాయని కలెక్టర్ హెచ్చరించారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...