క్యాన్సర్‌ను పారదోలుదాం


Mon,October 14, 2019 01:18 AM

ఖైరతాబాద్, అక్టోబర్ 13 :క్యాన్సర్‌ను అధిమిద్దాం.. ఆరోగ్యకరమైన భారతావణిని నిర్మిద్దాం అంటూ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌మార్గ్ వద్దగల హెచ్‌ఎండీఏ మైదానం వద్ద 2కే, 5కే, 10కే అవగాహన రన్ నిర్వహించారు. ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ సహకారంతో భారత్‌తో పాటు వివిధ దేశాల్లో ఏకకాలంలో ఈ రన్‌ను నిర్వహిస్తున్నారు. ఆదివారం ఎన్టీఆర్ మార్గ్ వద్ద సుమారు పది వేల మందితో నిర్వహించిన ఈ రన్‌ను ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డీ. ప్రభాకర్ రావు, సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్, ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావుతో కలిసి ప్రారంభించగా, ట్యాంక్‌బండ్ మీదుగా సాగింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కోటి మందికిపైగా ఈ వ్యాధి బారిన పడి మృత్యువాత పడ్డారన్నారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ దేశ, విదేశాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలను జాగృతం చేయడం అభినందనీయమన్నారు. గ్రేస్ ఫౌండేషన్ చైర్మన్, రిటైర్డ్ ఐజీ సుజాత రావు, ఫౌండేషన్ వ్యవస్థాపకులు, సీఈవో డాక్టర్ చిన్న బాబు సుంకపల్లి, రేస్ డైరెక్టర్ డాక్టర్ ఉదయరాజు, డాక్టర్ విజయ్ ఆనంద్ రెడ్డి, వివిధ కళాశాలల విద్యార్థులు, యువతీ, యువకులు పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...