20న తోడు నీడ పరిచయ వేదిక


Mon,October 14, 2019 01:14 AM

ఖైరతాబాద్, అక్టోబర్ 13 : తోడు నీడ స్వచ్ఛంద సంస్థ పదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 20న 50 సంవత్సరాలు పైబడిన ఒంటరి మహిళలు, పురుషులకు ఉచిత పరిచయ వేదిక నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎన్‌ఎం. రాజేశ్వరి తెలిపారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్‌ఎంఎన్ గ్రూప్ చైర్‌పర్సన్ జూపల్లి మంజులా రావు, న్యాయవాది, తోడునీడ ఉపాధ్యక్షురాలు రాధా దేవితో కలిసి ఆమె మాట్లాడారు. వివాహమై వివిధ కారణాల చేత విడిపోయిన వారికి, భార్య లేదా భర్త మృతిచెంది 50 సంవత్సరాలు నిండిన వారికి అండగా తోడు నీడ స్వచ్ఛంద సంస్థ నిలుస్తుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 200 మంది జంటలకు వివాహం, లివింగ్ రిలేషన్ తమ సంస్థ ఆధ్వర్యంలో జరిపించినట్లు, వారు ఎంతో ఆనందంగా గడుపుతున్నారని పేర్కొన్నారు. ఒక వేళ వివాహం లేదా సహజీవనం జరుపలేని వారి కోసం ఆనంద యాత్ర, కమ్యూనిటీ లివింగ్, డే కేర్ సెంటర్ సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఆనంద యాత్రలో భాగంగా ఏదైన ఒక ప్రాంతానికి గ్రూప్‌గా విహారయాత్రకు తీసుకెళ్లి వారు ఆనందంగా గడిపేలా చూస్తామని తెలిపారు.

అందులో భాగంగా స్త్రీ, పురుషులు కలిసి చాలా సమయం గడుపడం వల్ల పరిచయాలు పెరిగి ఒకరి భావాలు మరొకరు పంచుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. డే కేర్ కేంద్రంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అందరూ కలిసి క్యారమ్స్, చెస్, అంత్యక్షరి, మ్యూజికల్ చైర్ లాంటి గేమ్స్ ఆడుకుంటారని, పుట్టిన రోజు వేడుకలు జరుపుకొని ఎంతో సంతోషంగా గడిపి తిరిగి ఎవరి ఇంటికి వారు వెళ్లిపోతారని తెలిపారు. అలాగే డే కేర్‌లలో స్త్రీలు, పురుషులకు వేర్వేరుగా బ్యాచిలర్స్ ఉండే వీలు కూడా కల్పిస్తున్నామని, వారికి అన్ని సదుపాయాలు తాము సమకూర్చి అందుకు అయ్యే ఖర్చు అందరూ కలిసి షేర్ చేసుకునేలా చూస్తామన్నారు. 20న తార్నాకలోని టేస్ట్ ఆఫ్ ఇండియా హోటల్‌లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారు తప్పనిసరిగా ఆధార్‌కార్డు, సహచరులను డెత్ సర్టిఫికేట్, విడాకుల మంజూరీ పత్రాలు, రెండు ఫొటోలు తీసుకురావాల్సి ఉంటుందని, పాత సభ్యులు కూడా సదరు పత్రాలే తీసుకురావాలని, ఇతర వివరాలకు 8106367014, 7702455210 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles