హయత్‌నగర్‌లో బస్సు బీభత్సం


Mon,October 14, 2019 01:13 AM

హయత్‌నగర్ : హయత్‌నగర్‌లో బస్సు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో వాహనాన్ని నడిపిన డ్రైవర్ ఎదురుగా వచ్చిన వాహనాలను ఢీకొట్టుకుంటూ డివైడర్‌పైనున్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడికి స్వల్ప గాయాలు కాగా, పలువురు సురక్షితంగా బయటపడడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హయత్‌నగర్‌కు చెందిన వినోద్‌నాయక్ హయత్‌నగర్‌లో బస్సును నడిపిస్తున్నాడు. ఆదివారం రాత్రి సుమారు 7:15 గంటల సమయంలో హయత్‌నగర్ నుంచి దిల్‌సుఖ్‌నగర్ వైపునకు వెళ్తుండగా భాగ్యలతనగర్ సమీపంలోకి రాగానే బస్సు అదుపుతప్పింది. దీంతో అదే మార్గంలో వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొని ఆపై ముందున్న కారును ఢీకొట్టింది. అదే వేగంతో డివైడర్ పైనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి స్తంభాన్ని సుమారు 150 మీటర్ల వరకు ఈడ్చుకుంటూ వెళ్లింది. ఈ ప్రమాదంలో కొత్తపేట మోహన్‌నగర్‌కు చెందిన ద్విచక్ర వాహనదారుడు రామకృష్ణ తలకు స్వల్ప గాయాలు కాగా, కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇదిలా ఉండగా, బస్సు డ్రైవర్ వినోద్‌నాయక్ పూటుగా మద్యం సేవించి బస్సును నడిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...