విస్తరిత ఐటీ కారిడార్‌కు నీటి లభ్యత పెంపు


Mon,October 14, 2019 01:12 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఐటీ కారిడార్ జలకళను సంతరించుకోనున్నది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ కారిడార్‌కు నీటి లభ్యతను మరింత మెరుగుపర్చుతూ ఇప్పటికే రూ.398కోట్లతో నూతన పైపులైన్ విస్తరణ పనులను పూర్తి చేసింది. కుత్బుల్లాపూర్, రామచంద్రాపురం, పటాన్‌చెరు, అమీన్‌పూర్, బౌరంపేట, బాచుపల్లి, కృష్ణారెడ్డిపేట, బహదూర్‌పల్లి, అశోక్‌నగర్‌తోపాటు శేరిలింగంపల్లి, మాదాపూర్, గచ్చిబౌలి, నల్లగండ్ల లాంటి ఐటీ కారిడార్‌లో నీటి లభ్యత మరింత మెరుగుపర్చింది. ఈ క్రమంలోనే ఐటీ కారిడార్‌లో కోకాపేట ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. కోకాపేటలో భారీగా భవనాలు, హెచ్‌ఎండీఏ గోల్డెన్‌మైన్ లే అవుట్‌లో వాణిజ్య భవన నిర్మాణాలు వెలుస్తుండడం, హిమాయత్‌నగర్, గండిపేట, కోకాపేట, మంచిరేవుల, నార్సింగి గ్రామాల పరిధిలో ఐటీ కంపెనీలు, ఇతర బహులజాతి సంస్థలు విరివిగా వస్తుండడంతో తాగునీటికి డిమాండ్ ఏర్పడింది. ఈనేపథ్యంలోనే విస్తరిత ప్రాంతాల్లో మెరుగైన నీటి సరఫరాపై జలమండలి దృష్టి సారించింది.

కోకాపేటలో మినీ పట్టణాన్ని తలపించేలా వాతావరణం ఉండడంతో నీటి ఇబ్బందులు ఉండకుండా ఇప్పటి నుంచే పకడ్బందీ చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే జంట జలాశయాల నుంచి ఈ గ్రామాలకు నీటి సరఫరాను అందించాలని నిర్ణయించిన ఎండీ దానకిశోర్ ఈ మేరకు ఆరు గ్రామాల్లో పైపులైన్ విస్తరణ పనులకు ఎన్‌సీసీ కన్సల్టెన్సీ ఇచ్చిన నివేదికను ఆచరణలోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 11.6 కిలోమీటర్ల మెయిన్ పైపులైన్ విస్తరణతోపాటు 800 మీటర్ల(ఆర్‌ఎంటీ) మేర ఇన్‌లెట్, ఔట్‌లెట్, డిస్ట్రిబ్యూషన్ పైపులైన్ పనులకు గానూ రూ. 27కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేశారు. త్వరలోనే ఈ ఆరు గ్రామాల్లో నీటి సరఫరా మెరుగునకుగానూ టెండర్లను ఆహ్వానించి పనులను ప్రారంభించనున్నామని అధికారులు తెలిపారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...