నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలపై విచారణ


Sat,October 12, 2019 02:40 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : రవాణాశాఖలో నకిలీ ఇన్సూరెన్స్ పత్రాల వ్యవహారంపై గత నెల 22న నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన వార్తకు స్పందన లభించింది. నగర రవాణాశాఖ విభాగంలో యథేచ్ఛగా అధికారుల అండదండలతో ఇన్సూరెన్స్ పత్రాలతో బురిడి కొట్టిస్తూ స్క్రాప్ దందాతోపాటు పర్మిట్లు జారీచేస్తున్నారు. ఈ విషయాన్ని నమస్తే తెలంగాణ వెల్లడించింది. వార్తకు స్పందించిన పోలీసుశాఖతోపాటు రవాణాశాఖ అధికారులు దీనిపై విచారణ చేయగా 800 సర్టిఫికెట్లు దొరికాయి. అరెస్టు చేసిన వ్యక్తులు ఇచ్చిన వివరాలు, దొరికిన సమాచారం ఆధారంగా లోతుల్లోకి వెళ్తున్నారు. ఇందులో కీలకపాత్ర పోషిస్తున్న అధికారులెవ్వరు, కార్యాలయాల్లో వత్తాసు పలుకుతున్న సిబ్బందెవరనే విషయంపై ఆరా తీస్తున్నారు. వాస్తవానికి ఆటోలు స్క్రాప్ చేసినప్పుడు స్క్రాప్ చేసే ఆటోకు సంబంధించి అన్ని పత్రాలు రవాణాశాఖ అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో వాహన బీమాకు సంబంధించిన పత్రం కూడా ఉండాలి. వాహనానికి సంబంధించిన ఇన్సూరెన్సు వ్యాలిడిటీతో ఉండాలి. వాహనం స్క్రాప్‌కు ఇచ్చేనాటికి బీమా కొనసాగుతున్న పత్రాలు ఉండాలి. విలువైన బీమా పత్రాలు దాదాపు స్క్రాప్ చేసే ఏ ఆటోకు సమర్పించడం లేదు. నిబంధనలు ఏ మాత్రం పట్టించుకోకుండా ఇన్సూరెన్స్ పత్రాలు లేకున్పప్పటికీ ముందే సిబ్బందితో దళారులు మాట్లాడుకుని వాహనాన్ని స్క్రాప్ చేసి కొత్త ఆటో కొనుగోలు చేసుకోవడానికి అనుమతులు ఇస్తున్నారు. గ్రేటర్‌లో ప్రతి నెలా దాదాపు 350 పాత ఆటోలు స్క్రాప్ చేసి కొత్త ఆటోలు తెచ్చుకుంటున్నారు. ఇది బహిరంగంగా జరుగుతున్నా అధికారులు అనుమతులు ఇస్తున్నట్లు విమర్శలున్నాయి.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...