రోడ్డును ఆక్రమిస్తే కఠిన చర్యలు : డీసీ


Sat,October 12, 2019 02:39 AM

కేపీహెచ్‌బీ కాలనీ, అక్టోబర్ 11 : రోడ్డు, ఫుట్‌పాత్‌లను ఆక్రమిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని మూసాపేట సర్కిల్ ఉప కమిషనర్ పల్లె మోహన్‌రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం మూసాపేట సర్కిల్ పరిధిలోని కూకట్‌పల్లి ఆర్టీసీ బస్ టర్మినల్ సమీపంలో రోడ్డు ఆక్రమణదారుడికి రూ. 10 వేలు జరిమానా విధించారు. రోడ్డును ఆక్రమిం చి దుకాణాలు నడపడం వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని వీటి పై జీహెచ్‌ఎంసీ కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు.

ప్లాస్టిక్ డ్రైవ్‌లో : మూసాపేట సర్కిల్ పరిధిలో నిర్వహించిన ప్లాస్టిక్ డ్రైవ్‌లో ఐదు కేసుల్లో రూ.5,500 జరిమానా విధించినట్లు సర్కిల్ ఏఎంహెచ్‌వో సంపత్‌కుమార్ తెలిపారు. నిషేధిత ప్లాస్టిక్ కవర్లను వినియోగించడం మానుకోవాలని ప్రజలను కోరారు. వివిధ దుకాణాలలో నిషేధిత ప్లాస్టిక్ కవర్లు ఉపయోగిస్తున్నారని వీటిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ డ్రైవ్ నిరంతరంగా చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...